ఎమ్మెల్సీకి మంత్రి పదవి ఇవ్వండి
రాయచూరు రూరల్: రాయచూరు ఎమ్మెల్సీ వసంత్ కుమార్‌కు త్వరలో జరగనున్న కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి ఇవ్వాలని వెనుక బడిన వర్గాల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలెకాయ మారెప్ప పేర్కొన్నారు. బుధవారం బెంగళూరులో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఈమేరకు విన్నవించారు.
పాడి పశువులను సంరక్షించాలి
రాయచూరు రూరల్: నగర, గ్రామీణ ప్రాంతాల్లో పాడి పశువుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుండాలని అదనపు జిల్లాధికారి శివానంద పేర్కొన్నారు. బుధవారం జిల్లాధికారి కార్యాలయంలో గాలికుంటు వ్యాధి ప్రచార జాతా బ్యానర్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. శిబిరంతో పాడి పశువుల పెంపకందార్లకు ఆదాయం పెరిగేందుకు వీలవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ గాలి కుంటు వ్యాధి ఇంజెక్షన్లు వేయించాలన్నారు. శిబిరంలో 3 లీటర్ల సామర్థ్యంగల లిక్విడ్ నైట్రోజన్ టెంపరేచర్ పరికరాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ ఓం సింగ్, వాల్మీకి నాయక్‌లున్నారు.
కూరగాయల మార్కెట్ తరలింపు
రాయచూరు రూరల్: నగరంలో యరగేర కాలనీలోని కూరగాయల మార్కెట్‌ను నగరసభ అధికారులు పాత మార్కెట్‌లోకి తరలించారు. బుధవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో పల్లెల నుంచి రైతులు తెచ్చిన కాయగూరలను పాత ఉస్మానియా మార్కెట్‌కు తీసుకెళ్లాలని ఆదేశించారు. కోవిడ్ సమయంలో ఆయా ప్రాంతాల్లో నగరసభ అధికారులు ఏర్పాటు చేసిన దుకాణాలను నిరంతరం అలాగే ఉంచేశారు. దీంతో నగరసభకు రావాల్సిన అదాయం తగ్గిపోవడంతో అక్కడి విక్రయదారులను పాత మార్కెట్‌కు తరలించారు. ఉదయం 4 గంటల నుంచి 9 గంటల వరకు వ్యాపారాలు కొనసాగిస్తారు. ఇకపై ఈ ప్రాంత ప్రజలు రెండు కి.మీ.ల దూరంలోని పాత మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు కొనుగోలు చేయాల్సి ఉంది.
వైభవంగా అన్నమయ్య తాత రథోత్సవం
రాయచూరు రూరల్: జిల్లాలోని మాన్వి పట్టణ శివారులోని కొండపై అన్నమయ్య తాత రథోత్సవం వైభవంగా జరిగింది. మంగళవారం రాత్రి వందలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవం నిర్వహించారు. అన్నమయ్య తాత రథానికి మాజీ శాసన సభ్యుడు రాజా వెంకటప్ప నాయక్, పూజారి నాగేష్ తదితరులు ప్రత్యేక పూజలను నెరవేర్చారు. రథోత్సవంలో రాయచూరు, మాన్వి, సింధనూరు తాలూకాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీవారి కళ్యాణోత్సవం ప్రారంభం
రాయచూరు రూరల్ : నగరంలో మూడు రోజుల పాటు జరగనున్న శ్రీవారి కళ్యాణోత్సవం ప్రారంభమైంది. బుధవారం నగరంలోని నవోదయ వైద్య కళాశాల ఆవరణలో వెలసిన వేంకటేఽశ్వర స్వామి పవిత్రోత్సవ సేవలకు నారాయణపేటె మాజీ శాసన సభ్యుడు ఎస్.రాజేంద్రరెడ్డి దంపతులు సుప్రభాత సేవలు, పరిమళ ఆరాధనలు చేశారు.
ఎమ్మెల్సీకి మంత్రి పదవి ఇవ్వండి
ఎమ్మెల్సీకి మంత్రి పదవి ఇవ్వండి
ఎమ్మెల్సీకి మంత్రి పదవి ఇవ్వండి
ఎమ్మెల్సీకి మంత్రి పదవి ఇవ్వండి


