బళ్లారిఅర్బన్: కార్తీక పౌర్ణమి, గౌరీ నోములు పండుగలు కలసి రావడంతో బుధవారం స్థానిక బెంగళూరు రోడ్డులో పండుగ సామగ్రి కొనుగోళ్లతో స్థానికులు సందడిగా కనిపించారు. గౌరీ నోములకు కావాల్సిన చక్కెర హారతులు, నోము దారాలు, పటాసులు తదితరాలను కొనుగోలు చేయడంలో నగర వాసులతో పాటు గ్రామీణులు బిజీబిజీగా కనిపించారు. కిలో చక్కెర హారతులు రూ.100, మల్లెపూలు కిలో రూ.400, ఇతర రకాల పూలు కిలో రూ.200 చొప్పున ధరలు పలికాయి. టపాసుల ధరలు ఆకాశాన్నంటాయి. అయినా తప్పనిసరిగా కొనుగోలు చేశారు. ముఖ్యంగా నోముదారాలతో పాటు కార్తీక దీపాలను వెలిగించేందుకు కూడా పూజా సామగ్రిని కొనుగోలు చేశారు.


