తీర్థయాత్రలో విషాదపర్వం
సాక్షి, బళ్లారి/ బనశంకరి: కారు – గూడ్స్ వాహనం ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. బుధవారం ఉదయం 7:30 సమయంలో బీదర్ జిల్లా బాల్కి తాలూకా నీలమండి తాండా సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణకు చెందిన రాచప్ప (57), నవీణ్ (30), నాగరాజు (39), అనే వ్యక్తులు చనిపోయారు. బాధితులు తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ తాలూకాలో జగన్నాథ పుర గ్రామానికి చెందినవారు. ఐదుమంది కలబుర్గి జిల్లాలోని గాణుగపురలో వెలసిన దత్తాత్రేయ స్వామి దేవస్థానం దర్శనానికి వెళ్లారు. దర్శనం ముగించుకుని కారులో తిరుగు పయనమయ్యారు. ఘటనాస్థలి వద్ద ఎదురుగా వస్తున్న ఓ కొరియర్ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు కాగా ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు, రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. గాయపడిన వారిని బీదర్ బీమ్స్ ఆస్పత్రికి తరలించారు.
కారును ఢీకొన్న గూడ్స్ వ్యాన్
ముగ్గురు తెలంగాణవాసుల మృతి
బీదర్ జిల్లాలో దుర్ఘటన


