గడినాడులో కన్నడ రాజ్యోత్సవ ఆచరణ
రాయచూరు రూరల్: కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కర్ణాటక గడినాడులో కన్నడ రాజ్యోత్సవ ఆచరణలో భాగంగా ద్వజారోహణ గావించారు. శక్తినగర్‌కు 5 కి.మీ దూరంలో మారుమూలన మక్తల్ తాలూకా మాగనూరు మండలం కృష్ణాలో ప్రభుత్వ పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయిడు నిజాముఽధ్దీన్ భువనేశ్వరి చిత్రపటానికి పూజలు జరిపి మాట్లాడారు. కన్నడ బాష, నేల, నీరు, విద్య, ఆరోగ్య రంగంపై చిత్తశుద్ధితో శ్రద్ధగా పని చేయాలన్నారు. కుల, అదాయ, మరణ, జనన ప్రమాణ పత్రాలకు సంబంధించి కర్ణాటక సంభ్రమ నూరు నాటక సర్కార్‌పై ఒత్తిడి తేవాలన్నారు. 10వ తరగతి అనంతరం పై చదువులు చదివేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నాగరాజ్, గోపాల్, రంగారావ్, రేణుకాదేవి, శేఖర్, రఘు, మహేష్ కుమారులున్నారు.
ప్రజలకు సమాచారం అందించాలి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో సామాన్య ప్రజలకు సమాచారం అందించడం ప్రధాన కర్తవ్యమని కలబుర్గి డివిజన్ సమాచార హక్కు కమిషనర్ వెంకట సింగ్ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని తపోవనంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. 2005లో కేంద్ర సర్కార్ కమిషన్‌ను ప్రారంభించిందన్నారు. కార్యక్రమంలో బసవరాజ స్వామి, విశ్వనాథ్ స్వామి, శంకరప్ప, అమరేష్, జయన్న, రామణ్ణ, నాగరాజ్, శాంతప్ప లున్నారు.
వాయువ్య ఆర్టీసీ కన్నడ
విమానంపై ప్రశంసలు
హుబ్లీ: వాయువ్య కర్ణాటక ఆర్టీసీ సంస్థ కన్నడ రాజ్యోత్సవ శోభ వేళ ప్రత్యేక విమానంలో తమ కన్నడ అభిమానాన్ని చాటుకుంది. కన్నడ పరంపర సంస్కృతిని ప్రతిభంబించే శభ్య చిత్రాలను తీర్చిదిద్దడం ద్వార వాణిజ్య నగర ప్రజల్లో కన్నడ అభిమానాన్ని పెంచించింది. నగర, గ్రామీణ డిజవిన్ ఆధ్వర్యంలో చిత్రదుర్గ కోట వర్క్ ఫాసు సిబ్బంది హంపీ తేరు సిద్దం చేసి నమూనాతో అందరికి ఆకట్టుకుంది. ఇందులో ప్రభుత్వ ఉచిత నారి శక్తి బస్సు పథకం వల్ల లింకావార్డు దక్కడం అలాగే చిగరి బస్సు సేవల గురించి వివరించారు. ఆ సంస్థ డ్రైవర్ బస్సుసునే కన్నడ రథంగా మారుస్తూ డిజైన్ చేశారు. కన్నడ కస్తూరి పరిమరాలు అంతటా వ్యాపించాయి. హుబ్లీ గ్రామీణ విభాగం– 1వ గ్రామీణ డిపో డ్రైవర్ నాగరాజు తన సంపదలోని రూ.లక్షకు పైగా డబ్బులు ఖర్చు చేసి బస్సును కన్నడ తేరుగా తీర్చిదిద్దారు. గత కొన్నేళ్ల నుంచి ఈయన రాజ్యోత్సవాన్ని ఎన్నటికీ మరువలేని విధంగా మొత్తానికి ఇలాంటి కార్యక్రమాలతో కన్నడ భక్తిని చాటుకున్నారు.
గడినాడులో కన్నడ రాజ్యోత్సవ ఆచరణ


