పురస్కార గ్రహీతలకు సత్కారం
కోలారు: కన్నడ సాహిత్య అకాడగి పురస్కార గ్రహీతలు పద్మాలయ నాగరాజ్, కవి గంగప్ప తళవార్‌లను ఆదివారం ఘనంగా సత్కరించారు. లక్కూరు ఫిర్కా కేంద్రంలోని జూనియర్ కళాశాలలో ఆదివారం పురస్కార గ్రహీతల అభినందన సభ జరిగింది. ప్రముఖ కవి చంద్రశేఖర నంగలి మాట్లాడుతూ అవార్డు గ్రహీతలు బహుముఖ జ్ఙాన సంపద అలవర్చుకున్నారని పేర్కొన్నారు. అచల గురుపరంపర, పారంపరిక నాటువైద్యం, శిల్పి, వాస్తు శిల్పి, రచన, హరికథ, తంబూరి, తత్వ పదాల రచనల్లోనూ అపర సాధన చేశారని వివరించారు. తాలూకా కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు ఎంవీ.హనుమంతయ్య మాట్లాడుతూ సన్మానితులు కన్నడ నాడుకు అపార సేవలందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శంకరప్ప, వైస్ ప్రిన్సిపల్ అలీఉన్నీసా, ప్రాధ్యాపకుడు విశ్వేశ్వరయ్య, కృష్ణారెడ్డి, ఆర్.వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.


