
భార్య నరికివేత
బనశంకరి: బెంగళూరులో కొందరు అవినీతి అధికారులు రూ.200 కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు బీజేపీ నేత ఎన్‌ఆర్.రమేశ్ ఆరోపించారు. లోకాయుక్తకు, అలాగే బెంగళూరు నగరజిల్లా కలెక్టర్ జగదీశ్ కు ఆధారాలతో సహా ఫిర్యాదుచేసి మాట్లాడారు.
బెంగళూరు దక్షిణ తాలూకా ఉత్తరహళ్లి హొబళి మానవర్త కావల్ గ్రామ సర్వే నంబరు 18లో మొత్తం 353 ఎకరాలు 27 గుంటలు భూమిని వాజరహళ్లి, తలఘట్టపుర గ్రామస్తులు అనేక ఏళ్ల క్రితం పంచుకున్నారు. ఇందులో 35 ఎకరాల 11 గుంటలు భూమి పూర్తిగా ఏ, బీ ఖరాబు భూమి. అక్కడ మైనింగ్ జరిగేది, రూ.200 కోట్లకు పైగా మార్కెట్ విలువ చేస్తుంది. ఈ స్థలాన్ని తాలూకాఫీసు, కలెక్టరేటులోని కొందరు ఉద్యోగులు, ఉన్నతాధికారుల అండతో బడాబాబులు కబ్జా చేసుకున్నారని తెలిపారు. కబ్జాదారులు, అధికారుల పేర్లతో సహా లోకాయుక్తకు, కలెక్టరుకు ఫిర్యాదుచేసినట్లు తెలిపారు. ఆ భూమిని కాపాడాలని కోరారు.

భార్య నరికివేత