
దీపావళి పండుగ.. కొనుగోళ్లు తోడుగా
సాక్షి, బెంగళూరు: దీపావళి అంటేనే అందరికీ ఉత్సాహం. పండుగకు ఇక నాలుగైదు రోజులే మిగిలి ఉండగా ఐటీ సిటీలో షాపింగ్ సందడి జోరందుకుంది. పలు రకాల దుకాణాలు, మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. దుస్తులు, బంగారు ఆభరణాలు, గృహోపకరణాలు తదితర షాపింగ్ ఊపందుకుంది. ఇప్పటికే చిక్‌పేట, కేఆర్ మార్కెట్, ఎస్పీ రోడ్డు, జేసీ రోడ్డు , కమర్షియల్ మార్కెట్, శివాజీనగర, జయనగర ఫోర్త్ బ్లాక్, మల్లేశ్వరం వంటి షాపింగ్ కేంద్రాలు, మార్కెట్లు వ్యాపారాలతో, కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.
వస్త్ర దుకాణాల్లో రద్దీ
ముఖ్యంగా దుస్తుల కొనుగోలు కోసం నగరంలోని ప్రధాన చిక్‌పేటకు జనాలు తరలివస్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వివిధ రకాల సంప్రదాయ, ట్రెండీ దుస్తులకు గిరాకీ ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు.
పసిడి కొనుగోళ్లు
మహిళలు ఎంతో మెచ్చే బంగారు, వజ్రాభరణాలకు గిరాకీ ఉంటోంది. బంగారం ధరలు భగ్గుమంటున్నా కూడా కొనుగోలుకు వెనుకాడడం లేదు. జ్యువెలరీ షోరూమ్‌లు కళగా మారాయి. దంతెరాస్ కూడా రావడంతో నగల షాపులకు మరింత రద్దీ నెలకొంది. నగల షోరూంలు ఆఫర్లతో ఆకర్షిస్తున్నాయి.
ఇంటి సింగారానికి
దీపావళికి ఇంటిని సుందరంగా ముస్తాబుకు నగరవాసులు ఆసక్తి కనపరుస్తున్నారు. మాల్స్, షాపుల్లో వివిధ రకాల బ్రాండ్ల హోమ్ డెకరేషన్ ఐటంలకు గిరాకీ ఏర్పడింది. వాల్ హ్యాంగింగ్, కర్టెన్లు, కృత్రిమ పూలు, అలంకార సామగ్రి మార్కెట్లను ముంచెత్తింది. మిఠాయి దుకాణాలు, గిఫ్ట్ ప్యాక్‌లకు డిమాండు నెలకొంది. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తు అమ్మకాలపై వ్యాపారులు డిస్కౌంట్స్ అందిస్తున్నారు. ఇక టపాసుల విక్రయాలు సరేసరి. నియమ నిబంధనలు ఎలా ఉన్నప్పటికీ పటాకులను పేలిస్తేనే దీపావళి అనే భావన ఉంది. మధ్యతరగతి కుటుంబాలు కూడా టపాసుల కోసం వేలాది రూపాయలు వెచ్చిస్తాయి.
బాలిక అనుశ్రీ (ఫైల్)
ప్రమాదానికి కారణమైన ట్యాంకర్
బెంగళూరు మార్కెట్లు కిటకిట
దుస్తులు, నగలు, గృహోపకరణాల షాపుల్లో రద్దీ

దీపావళి పండుగ.. కొనుగోళ్లు తోడుగా

దీపావళి పండుగ.. కొనుగోళ్లు తోడుగా

దీపావళి పండుగ.. కొనుగోళ్లు తోడుగా

దీపావళి పండుగ.. కొనుగోళ్లు తోడుగా