
విరుపాక్షుని సన్నిధిలో నిర్మలమ్మ
సాక్షి,బళ్లారి: ప్రపంచ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతూ, దక్షిణ కాశీగా పేరుగాంచిన హంపీలోని శ్రీ విరుపాక్షేశ్వర స్వామిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దర్శించుకున్నారు. ఆమె బుధవారం ఉదయం హంపీకి విచ్చేయడంతో ఆలయ గజరాజు ఘనస్వాగతం పలికింది. ఏనుగుతో స్థానిక అధికారులు పూలమాల వేయించి స్వాగతం పలికిన అనంతరం శ్రీవిరుపాక్షేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక్‌సభ సభ్యుడు తుకారాం, హంపీ విద్యారణ్య భారతీ తీర్థ స్వామి కూడా ఆమెను కలిసి మాట్లాడారు. హంపీ శిల్ప కళా అందాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఇక్కడ ఉన్న కట్టడాలు ప్రపంచంలోనే గుర్తింపు పొందాయన్నారు. హంపీ అందాలను ఎంత చూసినా తనివి తీరదన్నారు. శ్రీకృష్ణదేవరాయల పాలనను స్మరించారు. నిర్మలా సీతారామన్ ఆప్త కార్యదర్శి అనిరుధ్ శ్రవణ్, జిల్లాధికారిణి కవిత, ఆనెగుంది సంస్థానం రాజవంశస్థులు తదితరులు పాల్గొన్నారు.
హంపీలో స్వామివారిని
దర్శించుకున్న వైనం
శిల్పకళ అందాలు అదుర్స్
అన్న కేంద్ర మంత్రి

విరుపాక్షుని సన్నిధిలో నిర్మలమ్మ

విరుపాక్షుని సన్నిధిలో నిర్మలమ్మ

విరుపాక్షుని సన్నిధిలో నిర్మలమ్మ