
అభాగ్యుల పెన్నిధి.. ఆ దంపతులు
హుబ్లీ: వీధుల్లో అందరికీ దూరమై వివిధ అనారోగ్య సమస్యలతో అలమటించే వారి పాలిట కరియప్ప, సునందమ్మ దంపతులు ఆత్మీయులుగా ఆదరణ చూపి ఆ అభాగ్యులకు పట్టెడన్నం పెట్టి గత 15 ఏళ్లుగా నగరంలో సేవలు అందిస్తున్నారు. గదగ్ జిల్లా లక్ష్మేశ్వరకు చెందిన ఈ దంపతులు తమ సంపాదనలోనే హుబ్లీ ఆనంద్‌నగర్‌లో అద్దె ఇంట్లో ఉంటూ ఆహారం తయారు చేసి నిరాశ్రయులకు తమ సొంత డబ్బులతో భోజనం, రొట్టెలు, చపాతీలు సమకూరుస్తారు. అంతమాత్రానికే వీరేమీ ఆర్థికంగా సంపన్నులు కాదు. అయినా దిక్కులేని వారికి పట్టెడన్నం పెట్టి మానవత్వం చాటుకోవాలన్నదే ఈ దంపతుల తాపత్రయం.
ఇంట్లోనే రొట్టెల తయారీ
కరియప్ప గతంలో కారు డ్రైవర్‌గా పని చేసేవాడు. అనంతరం టెంకాయల వ్యాపారంతో పాటు చిన్న సైజ్ కిరాణ అంగడి పెట్టుకున్నారు. ఆయన భార్య సునందమ్మ ఇంట్లోనే రొట్టెలు తయారు చేసి నిరాశ్రయులకు పంచుతారు. ఈ మేరకు వీరు తమ తండ్రి కరియప్ప శిరహట్టి పేరిట సేవా సంస్థ ద్వారా ఈ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. తమకు ఓ వాహనాన్ని దాతలు అందించాలని ఆయన కోరారు. మాకు సంతానం లేదు. నిరాశ్రయులే మా పిల్లలని భావించి రోజూ తమ నీలప్ప గుడ్డప్ప శిరహట్టి సేవా సంస్థ ద్వారా ఈ సేవలు అందిస్తున్నామని ఆ దంపతులు తమ సేవా వివరాలను వెల్లడించారు.
సొంత డబ్బుతో భోజనం పంపిణీ
గత 15 ఏళ్లుగా నగరంలో సేవలు

అభాగ్యుల పెన్నిధి.. ఆ దంపతులు

అభాగ్యుల పెన్నిధి.. ఆ దంపతులు