
రాష్ట్రానికి గజ బలం
యశవంతపుర: దేశంలో ఏనుగులపై నిర్వహించిన సర్వేలో కర్ణాటకలో అగ్రస్థానంలో నిలిచింది. కన్నడనాట రికార్డుస్థాయిలో 6,013 ఏనుగులున్నట్లు గుర్తించారు. దేశంలో అన్ని రాష్ట్రాలలో కలిపి 22,446 గజరాజులు ఉన్నట్లు గుర్తించారు. అయితే దేశంలో 2017తో పోల్చితే ఇప్పుడు 18 శాతం అంటే 5 వేల ఏనుగుల సంఖ్య క్షీణించినట్లు బయటపడింది. దేశంలో కర్ణాటకతో కలిపి పశ్చిమ ఘాట్లలో 11,934 ఏనుగులు నివసిస్తున్నాయి. రెండవ అసోం– 4159, తమిళనాడు–3136, కేరళ–2785, ఉత్తరాఖండ్–1792, ఒడిశా–912, చత్తీస్‌ఘడ్, జార్ఖండ్–650, మధ్యప్రదేశ్–97, మహారాష్ట్ర– 63 ఏనుగులు ఉన్నాయి.
ఏయే జిల్లాల్లో..
ఇప్పటికే కర్ణాటక పులుల సంఖ్యలోనూ అగ్రస్థానంలో కొనసాగుతోంది. రాష్ట్రంలో బెంగళూరుతో కలిపి దక్షిణాది జిల్లాల్లోని అడవులు ఏనుగులకు ఆవాసంగా ఉంటున్నాయి. చామరాజనగర జిల్లా అడవుల్లో అత్యధికంగా ఉంటున్నాయి. తరువాత ఉత్తర కన్నడ, కొడగు, మైసూరు, మండ్య, హాసన్, బెంగళూరు రూరల్, తుమకూరు, కోలారు జిల్లాల్లో జీవిస్తున్నాయి, అప్పుడప్పుడూ ఉత్తర కర్ణాటకలోని కొన్ని జిల్లాల్లోనూ గజరాజులు కనిపిస్తాయి.
దేశంలో అత్యధిక ఏనుగులు ఇక్కడే

రాష్ట్రానికి గజ బలం