
540 ఎకరాల అటవీ భూమి స్వాధీనం
శ్రీనివాసపురం: తాలూకాలోని కొట్లవారిపల్లి అటవీ ప్రాంతంలో ఆక్రమణలకు గురైన అటవీ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సర్వే న బర్ 90లో సుమారు 500 నుంచి 540 ఎకరాల అటవీ భూమిని డిఎఫ్‌ఓ సరీనా సిక్కలిగర్ నేతృత్వంలో 20 జేసీబీలతో తొలగింపు పనులను చేపట్టారు. ఈ భూమిలో కొందరు రైతులు 20 సంవత్సరాల నుంచి పాగా వేశారు. మామిడి, టమాటా తోటలు, పూలు, ఇతరత్రా పంటలను పండిస్తున్నారు. బోర్లు కూడా వేశారు. కబ్జాలు జరిగినట్లు ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపి రైతులకు నోటీసులు జారీచేసినట్లు సరీనా తెలిపారు. ఈ నేపథ్యంలో పంటలను తొలగిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో అటవీశాఖ సిబ్బంది అటవీకరణ కోసం మొక్కలను నాటుతున్నారు. ఇక్కడికి రైతులు రాకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. సిఎఫ్, కె మహేష్, ఆర్‌ఎఫ్ ఓ రవికీర్తి, సీఐ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆ భూముల్లో తోటల తొలగింపు