అనాథగా హంపీ ఉగ్ర నరసింహ విగ్రహం | - | Sakshi
Sakshi News home page

అనాథగా హంపీ ఉగ్ర నరసింహ విగ్రహం

Oct 12 2025 6:53 AM | Updated on Oct 12 2025 6:53 AM

అనాథగ

అనాథగా హంపీ ఉగ్ర నరసింహ విగ్రహం

హొసపేటె: హంపీ ఉగ్ర నరసింహ విగ్రహ స్మారక చిహ్నం ముఖంపై ఉన్న పొలుసులు రాలి పోతున్నాయి. ఈ స్మారక చిహ్నాన్ని సంరక్షించాలని పర్యావరణవేత్తలు డిమాండ్‌ చేశారు. ఈ స్మారక చిహ్నం గతంలో లక్ష్మీ నరసింహ స్మారక చిహ్నంగా ఉండేది. బహుమని సామ్రాజ్య సైనికుల దాడి తర్వాత ఈ స్మారక చిహ్నం దెబ్బతిన్నట్లు చరిత్ర చెబుతోంది. ఇప్పుడు మిగిలి ఉన్న ఉగ్రనరసింహ స్మారక చిహ్నం కూడా శిథిలావస్థకు చేరుకుంటున్నా పురావస్తు శాఖ మాత్రం మౌనంగా ఉంది. ఈ స్మారక చిహ్నాన్ని సంరక్షించడానికి పురావస్తు శాఖ చర్యలు తీసుకోవాలని పర్యాటకులు, చరిత్రకారులు డిమాండ్‌ చేశారు.

టెలిస్కోప్‌ శిక్షణలో జిల్లా విద్యార్థులకు ర్యాంక్‌లు

బళ్లారి అర్బన్‌: రాష్ట్ర విజ్ఞాన పరిశోధన పరిషత్‌ ద్వారా దొడ్డబళ్లాపురలో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రథమ టెలిస్కోప్‌ శిక్షణ శిబిరంలో పాల్గొన్న 150 మంది విద్యార్థుల్లో బళ్లారి జిల్లాకు చెందిన 7 మంది విద్యార్థులు పాల్గొనడమే కాకుండా ఈ సారి ప్రథమ శ్రేణి సాధించారు. వీవీ సంఘం దేశనూరు సదాశివరెడ్డి సీనియర్‌ ప్రాథమిక, హైస్కూల్‌, దేశనూరు దేవరాజ్‌, సిరుగుప్ప వివేకానంద హైస్కూల్‌ విద్యార్థి శివకుమార్‌ రాష్ట్రంలోనే ప్రథముడిగా వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్‌ుడ్స, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, అలాడే ఏసియా బుక్‌ రికార్డ్స్‌ ప్రశస్తిని దక్కించుకున్నారని ఆ పరిషత్‌ జిల్లాధ్యక్షుడు ఆర్‌హెచ్‌ఎం చెన్నబసవస్వామి తెలిపారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ శివకుమార్‌, దేవరాజ్‌, విద్యాసాగర్‌, సంజీవ్‌ శెట్టి, జాహ్నవి, మహమ్మద్‌ సోహిల్‌, గవిసిద్ద అనే విద్యార్థులకు సదరు పరిషత్‌ జిల్లా శాఖ అభినందనలు తెలిపింది. విద్యార్థులు చేసిన కృషికి వైజ్ఞానిక స్పూర్తి ప్రశంసనీయం అని వారు అభినందించారు.

రైతులను సర్కారు ఆదుకోవాలి

సాక్షి బళ్లారి: రాష్ట్రంలో అప్పుల బాధలను తాళలేక, పంటలు చేతికి అందకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు మాధవరెడ్డి డిమాండ్‌ చేశారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని కొళగల్లు గ్రామానికి చెందిన రైతు గాదిలింగ ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా బాధించిందన్నారు. పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో పాటు అప్పులు పెరిగిపోవడంతో క్రిమిసంహారక మందును తాగి ఆత్మహత్య చేసుకొన్నాడన్నారు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కృష్ణబైరేగౌడకు వినతిపత్రం అందజేశామన్నారు. జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో చాలా మంది రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు ఆత్మహత్య చేసుకోకుండా ప్రభుత్వం గట్టి భరోసా ఇవ్వాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. తూతూ మంత్రంగా పరిహారం ఇవ్వకుండా పంట ఎంత నష్టపోతే అంత మేరకు పరిహారం అందించాలని కోరారు.

రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం జాతా

రాయచూరు రూరల్‌: కర్ణాటక రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం జాతాకు శ్రీకారం చుట్టినట్లు కర్ణాటక రాష్ట్ర సమితి అధ్యక్షుడు రఘుపతి భట్‌ పేర్కొన్నారు. శనివారం బస్టాండ్‌ వద్ద ర్యాలీనుద్దేశించి మాట్లాడారు. విద్య, వైద్య, ఆర్థిక, సాంఘీక రంగాల్లో వెనుకబడి ఉందన్నారు. ప్రభుత్వం పంచ గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తోందన్నారు. రూ.కోట్లాది నిధులు మంజూరు చేశామని గొప్పలు చెప్పడం తప్ప మరేమీ లేదన్నారు. పరిశ్రమలు లేకపోవడంతో వ్యవసాయ కూలీలు, నిరుద్యోగులు బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌, గోవా వంటి ప్రాంతాలకు జీవనోపాధి కోసం వెళుతున్నారన్నారు. రాష్ట్ర సర్కార్‌ మొండి వైఖరిని ఖండిస్తూ ర్యాలీ చేశామన్నారు. అవినీతిలో కూరుకుపోయిన సర్కార్‌ను ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధం కావాలన్నారు. ఇకనైనా కుటుంబ రాజకీయాలకు పుల్‌ స్టాప్‌ పెట్టాలని ఆయన అన్నారు.

అనాథగా హంపీ   ఉగ్ర నరసింహ విగ్రహం1
1/3

అనాథగా హంపీ ఉగ్ర నరసింహ విగ్రహం

అనాథగా హంపీ   ఉగ్ర నరసింహ విగ్రహం2
2/3

అనాథగా హంపీ ఉగ్ర నరసింహ విగ్రహం

అనాథగా హంపీ   ఉగ్ర నరసింహ విగ్రహం3
3/3

అనాథగా హంపీ ఉగ్ర నరసింహ విగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement