
అంబేడ్కర్ హాస్టల్‌లో తనిఖీ
రాయచూరు రూరల్: నగరంలోని మంత్రాలయం రోడ్డులోని అంబేడ్కర్ హాస్టల్‌ను అసిస్టెంట్ కమిషనర్ గజానన బాళె పరిశీలించారు. శుక్రవారం ఉన్నఫళంగా హాస్టల్‌ను తనిఖీ చేసి వంట గదిని, ఇతర మౌలిక సౌకర్యాలను గురించి క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులతో కలిసి కూర్చొని భోజనం రుచి చూశారు. గ్రంథాలయం ఏర్పాటుతో పాటు పోటీ పరీక్షలకు సంబంధించి పుస్తకాల పంపిణీకి చర్యలు చేపట్టాలని సాంఘీక సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు.
కసాప జిల్లాధ్యక్షుడు రాజీనామా చేయాలి
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు రంగణ్ణ పాటిల్ రాజీనామా చేయాలని బెళకు సంస్థ అధ్యక్షుడు అణ్ణప్ప మేటిగౌడ డిమాండ్ చేశారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నాలుగేళ్ల నుంచి జిల్లాలో సాహిత్య పరిషత్ కార్యక్రమాలను నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించారన్నారు. అనారోగ్యంతో సాహిత్య పరిషత్ సేవలు చేయడానికి చేతకానప్పుడు రాజీనామా చేసి ఇతరులకు అవకాశం కల్పించాలన్నారు. రాష్ట్ర కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుల అనుమతి లేకుండా ఏడు తాలూకాల అధ్యక్షులను మార్పు చేసి నూతన అధ్యక్షులను నియమించారన్నారు. గతంలో ఉన్న అధ్యక్షులను కొనసాగించాలన్నారు. వారం రోజుల్లోపు పాటిల్ రాజీనామా చేయకపోతే అధ్యక్షుడి నివాసం ముందు ఆందోళన చేస్తామన్నారు.
నేరాల కట్టడికి సహకరించాలి
రాయచూరు రూరల్: నేరాల నియంత్రణకు విద్యార్థులు పోలీసులతో సహకరించాలని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ నరసమ్మ పేర్కొన్నారు. శనివారం నగరంలోని అల్ కరీం కళాశాల ప్రాంతంలో ఇంటింటికి పోలీస్ అనే కార్యక్రమంలో ప్రజలకు జనజాగృతి చేపట్టి మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో సైబర్ నేరాలు, పోక్సో చట్టం, ట్రాఫిక్ నియమాలు, ఈఆర్‌ఎస్ 112, 1930 సహాయవాణి ద్వారా ప్రజలు సహకరించాలని కోరారు.
టీబీ డ్యాం గేట్ల తయారీ పనులపై ఆరా
హొసపేటె: టీబీ డ్యాం ఎస్టేట్ ఆవరణలో చేపడుతున్న డ్యాం గేట్ల నిర్మాణ పనులను శనివారం తుంగభద్ర మండలి చైర్మన్ ఎస్‌ఎన్ పాండే పరిశీలించారు. ఇప్పటికే గేట్ల నిర్మాణ పనులు ఆలస్యం అయ్యాయని, పనులను వేగవంతం చేయాలని సంబంధిత కాంట్రాక్టరుకు సూచించారు. అదే విధంగా గదగ్‌లో కూడా చేపడుతున్న డ్యాం గేట్ల నిర్మాణ పనుల ప్రగతిని మండలి అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ప్రస్తుతం రెండు చోట్ల డ్యాంకు సంబంధించిన 32 గేట్ల నిర్మాణ పనులు ఇప్పటికే తుది దశకు చేరుకొన్నాయని మండలి అధికారులు తెలిపారు. మండలి కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ఎస్‌ఈ నారాయణ నాయక్, డ్యాం సెక్షన్ అధికారి జ్ఞానేశ్వర్, ఇంజినీర్లు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు ఎంపిక
హొసపేటె: హొసపేటెలోని నేషనల్ పీయూసీ కళాశాలలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సంజన కొట్టూరు త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు ఎంపికై ంది. సంజన గత నెలలో బెంగళూరులో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో తన చురుకుదనం, ధైర్యం, ఓర్పుతో న్యాయనిర్ణేతలు, ప్రేక్షకుల ప్రశంసలను గెలుచుకుంది. ఆమె అదే ఉత్సాహం, నైపుణ్యంతో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని జిల్లా గౌరవాన్ని పెంచాలని నేషనల్ పీయూసీ కళాశాల ప్రిన్సిపాల్ శశిధర్, అధ్యాపకులు, సిబ్బంది, తల్లిదండ్రులు, స్నేహితులు అభినందిస్తూ భవిష్యత్తుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

అంబేడ్కర్ హాస్టల్‌లో తనిఖీ

అంబేడ్కర్ హాస్టల్‌లో తనిఖీ

అంబేడ్కర్ హాస్టల్‌లో తనిఖీ