
వాహన సంచారం.. నరకప్రాయం
రాయచూరు రూరల్: రాయచూరు నగరంలో పార్కింగ్ సమస్యలు అధికమవుతున్నా నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, కమిషనర్ జుబిన్ మహాపాత్రో, ఎస్పీలు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. నగరంలో ఆక్రమణలకు గురైన ఫుట్‌పాత్‌లు పాదచారులకు అనానుకూలంగా మారినా నగరసభ అధికారులు మౌనంగా ఉన్నారు. పోలీసులు, నగరసభ అధికారులు తూతూమంత్రంగా కంటి తుడుపు చర్యలు చేపడుతున్నారు. జిల్లా పాలన యంత్రాంగం పుట్ పాత్‌లను తొలగించినా వాటిని మళ్లీ దుకాణాలు, హోటళ్ల వంటివి ఆక్రమించాయి. నగరంలోని రైల్వే స్టేషన్, రంగ మందిరం, అంబేడ్కర్ సర్కిల్, బస్టాండ్, తహసీల్దార్ కార్యాలయం, తాలూకా పంచాయతీ, హెడ్ పోస్టాఫీసు, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం, ఏక్ మినార్, తీన్ కందిల్, షరాఫ్ బజార్ ప్రాంతాల్లో సంచరించడానికి వీలు లేకుండా ట్రాఫిక్ సమస్య జటిలమైంది. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి ద్విచక్రవాహనాలను నిలుపుతున్నారు. రైల్వే స్టేషన్, రంగ మందిరం, అంబేడ్కర్ సర్కిల్, బస్టాండ్, తహసీల్దార్, తాలూకా పంచాయతీ, హెడ్ పోస్టాఫీసుల వద్ద ఆటో డ్రైవర్లు ఇష్టమొచ్చినట్లు ఆటోలను నడుపుతూ రహదారికి అడ్డంగా నిలబెడుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్‌లో లోపలకు బస్సులు వెళ్లాలంటే ఆటోలను అడ్డు తొలగించుకొని పోవడానికి ఆటంకంగా మారి వెనుక వైపు వాహనాలతో ట్రాఫిక్ స్తంభిస్తోంది. ఏక్ మీనార్, తీన్ కందిల్, షరాఫ్ బజారుల్లో రహదారి కిరువైపుల అంగళ్లు, హోటళ్లు, పండ్ల తోపుడు బండ్లు అడ్డంగా నిలబడుతాయి. పుట్‌పాత్‌ల మీద దుఖాణాలు పోలీస్‌లకు బంగారు బాతు గుడ్డులా మాకాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలో ప్రతి నిత్యం ద్విచక్ర వాహనదారులకు, పాదచారులకు ఆటోరిక్షాల వల్ల తిప్పలు తప్పడం లేదు.
నగరంలో అధికమవుతున్న పార్కింగ్ సమస్య
పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు

వాహన సంచారం.. నరకప్రాయం