
ప్రసన్న వేంకటేశ్వర స్వామికి పూజలు
కేజీఎఫ్ : ఐతిహాసిక ప్రసిద్ధ యాత్రాస్థలమైన చిక్కతిరుపతి ప్రసన్న వేంకటేశ్వర స్వామికి శనివారం విశేష పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు గోపాలకృష్ణ భరద్వాజ్, ఎన్.శ్రీధర్ నేతృత్వంలో స్వామి వారికి అభిషేకం నిర్వహించి పూలతో అలంకరణచేసి పూజలు నిర్వహించారు. తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో శ్రావణ మాసం ముగిసిన అనంతరం తమిళనాడులో శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. దీంతో ఆలయంలో స్వామివారికి పూజలు నిర్వహించారు.

ప్రసన్న వేంకటేశ్వర స్వామికి పూజలు