
మైసూరులో మరో ఘోరం
మైసూరు: మైసూరులో అందరూ చూస్తుండగానే కారులో నుంచి లాగి ఓ వ్యక్తిని నరికివేసిన దుర్ఘటన మరువకముందే మరో ఘోరం బయటపడింది. ఆ హత్య జరిగిన వస్తుప్రదర్శన మైదానం సమీపంలో ఓ బాలిక శవం గురువారం ఉదయం లభించింది. బెలూన్లను విక్రయిస్తున్న సుమారు 13 ఏళ్ల వయస్సుగల వలస కుటుంబం బాలిక శవం దుస్తులు లేని స్థితిలో కనిపించింది.
ఏం జరిగిందంటే..
వివరాలు.. ఇటీవల దసరా ఉత్సవాల సమయంలో కలబురిగి వైపు నుంచి బెలూన్లు, ఆట బొమ్మల్ని విక్రయించే ఎన్నో కుటుంబాలు మైసూరుకు వచ్చాయి. వస్తు ప్రదర్శన మైదానం సమీపంలో టెంట్లు వేసుకుని పగలంతా వ్యాపారం చేసి రాత్రికి బస చేసేవారు. అదే ప్రకారం బుధవారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి బాలిక నిద్రించింది. గురువారం ఉదయం నిద్ర లేచి చూడగా ఆమె కనిపించలేదు. టెంట్‌కు వెనుక భాగంలో బాలిక మృతదేహం పడి ఉంది.
ఎవరైనా దుండగులు అత్యాచారానికి పాల్పడి హత్య చేసి ఉంటారనే అనుమానం వ్యక్తమవుతోంది. పోలీసు ఉన్నతాధికారులు, జాగిలం, ఫోరెన్సిక్ సిబ్బంది చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని కేఆర్ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. బాలిక తల్లిదండ్రులను పోలీసులు పిలుచుకెళ్లి విచారణ చేస్తున్నారు. డీసీపీ బిందురాణి మాట్లాడుతూ దర్యాప్తు చేపట్టామని అన్నారు.
బొమ్మలు
అమ్మే బాలికపై అత్యాచారం, హత్య?

మైసూరులో మరో ఘోరం