
రాత్రంతా.. వణికించిన వాన
● రాజధానిలో కుండపోత
శివాజీనగర: సిలికాన్ సిటీలో అర్ధరాత్రి వరకూ కురిసిన ఉరుములు, మెరుపుల వర్షంతో పలు ప్రాంతాలు జలావృతమై వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు ఆరంభమైన కుండపోత వల్ల అనేకచోట్ల నీరు నిలిచింది. మాన్యతా టెక్ పార్కు, ఎలక్ట్రానిక్ సిటీ, మహాదేవపుర వద్ద రోడ్లలో నీరు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఎలక్ట్రానిక్ సిటీలో నీలాద్రి లేఔట్‌లో డ్రైనేజీ నీరు రోడ్డుపై ప్రవహించింది. ప్రజలు పాలికెకు విరుద్ధంగా సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేఆర్ మార్కెట్‌లో నీరు నిలబడి పూల వ్యాపారులు అవస్థలు పడ్డారు. వర్షంలో తడిసి సరుకు పాడైంది.
మరో మూడు రోజులు
రాష్ట్రంలో 15 వరకు వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఒళనాడులో వానలు పడుతున్నాయి. బెంగళూరుతో సహా కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను ప్రకటించారు.

రాత్రంతా.. వణికించిన వాన

రాత్రంతా.. వణికించిన వాన