
కెమెరా ప్రతిభకు దర్పణం
బనశంకరి: కెమెరా ప్రతిభకు దర్పణం పట్టేలా బెంగళూరు చిత్రకళాపరిషత్‌లో వైపీఎస్ ఇంటర్నేషనల్ సలాన్– 2025 ఛాయాచిత్ర ప్రదర్శన సందడి మొదలైంది. దేవరాజ అరస్ గ్యాలరీలో శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. దేశ విదేశాలకు చెందిన ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాల్లో బంధించిన విభిన్న రకాల ఛాయాచిత్రాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. ఆర్కిటెక్చర్, కలర్, మోనోక్రోమ్, నేచర్ తదితర విభాగాల చాయాచిత్రాలు నేత్రానందం కలిగిస్తాయి. ప్రతి విభాగంలోనూ ఎంతో నైపుణ్యంతో తీసిన ఫోటోలు చూపరులను అబ్బురపరచకుండా ఉండలేవు. ప్రపంచం నలుమూలల నుంచి ఫోటోగ్రాఫర్లు పంపిన చిత్రాల్లో ఎంపికై న 92 ఛాయాచిత్రాలను ప్రదర్శనలో ఉంచారు. వీకెండ్ రెండోశనివారం సెలవురోజు కావడంతో పెద్దసంఖ్యలో సందర్శకులు వచ్చారు. ఈ కార్యక్రమంలో వైపీఎస్ ముఖ్యులు మంజువికాస్‌శాస్త్రి, గిరీశ్ అనంత మూర్తి, ప్రేమకాకడే, హార్దిక్ షా పాల్గొన్నారు.
చిత్రకళా పరిషత్‌లో
సలాన్ ఛాయాచిత్ర ప్రదర్శన
అబ్బురపరిచే కళాత్మక దృశ్యాలు