
ఒత్తిళ్లతో ప్రశాంతత దూరం
రాయచూరు రూరల్: నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన యుగంలో కుటుంబాల్లో అనుబంధాలు, సంబంధాలు క్షీణించడం వల్లే ఒత్తిళ్లు అధికమై మానసిక ప్రశాంతతను కోల్పోతున్నట్లు నవోదయ వైద్య కళాశాల మానసిక వైద్య నిపుణుడు కె.పవన్ విచారం వ్యక్తం చేశారు. శనివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. దైనందిన కార్యక్రమాలు, పని ఒత్తిడి, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలతో సతమతమైన మానవుడు మానసికంగా కుంగిపోతాడన్నారు. రూపకళ, విజయలక్ష్మి, డాక్టర్ సుగుణ, హర్ష, సయ్యదా, రశీదా, స్వరూప రాణిలున్నారు.