
మహిళా ఉద్యోగులకు శుభవార్త
శివాజీనగర: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేసే యువతులు, మహిళలకు ప్రతి నెలా ఒకరోజు జీతంతో కూడిన సెలవు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రుతుస్రావ సమయంలో ఈ సెలవును ఉపయోగించుకోవచ్చు. గురువారం ఈ మేరకు సీఎం సిద్దరామయ్య, మంత్రుల సమావేశంలో ఆమోదం తెలిపారు. ఇతరత్రా ముఖ్య నిర్ణయాలను మంత్రి హెచ్.కే.పాటిల్ తెలిపారు.
కనకపురలో మెడికల్ కాలేజీ
● వైద్యవిద్యా శాఖ ద్వారా కనకపురలో కొత్త మెడికల్ కాలేజీ స్థాపన. రూ.550 కోట్లతో 300 పడకల బోధనా ఆసుపత్రి, హాస్టళ్ల నిర్మాణం.
● రాష్ట్రంలో కట్టడ కార్మికుల పిల్లలకు 11 హాస్టళ్లు
● రాష్ట్ర సివిల్ సేవల ఉద్యోగాల నియామకాలకు వయో పరిమితి 3 సంవత్సరాలు పెంపు. దీంతో నిరుద్యోగులకు ఊరట లభిస్తుంది
● బెంగళూరు ఉత్తర తాలూకా మాచోహళ్ళిలో 78 ఎకరాల అటవీ భూమిని వివిధ సంస్థలకు కేటాయించడాన్ని రద్దు చేశారు
● పోలీసుశాఖకు రూ.89.22 కోట్లతో పరికరాల కొనుగోలు, శిక్షణ వసతులు
● రూ.200 కోట్లతో వంతెనలకు మరమ్మతులు. అలాగే రూ.1000 కోట్లతో 39 వంతెనల నిర్మాణానికి అనుమతి.
నెలలో ఓరోజు వేతన సెలవు
కేబినెట్ భేటీలో ఆమోదం