
విద్యాభివృద్ధికి పంచవర్ష ప్రణాళిక
రాయచూరు రూరల్: విద్య, వైద్య, ఆరోగ్య, ఉద్యోగ రంగాల్లో ఇతర ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో ప్రాంతీయ అసమానతలతో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం హైదరాబాద్ కర్ణాటక అభివృద్ధి మండలిని ఏర్పాటు చేశారు. కళ్యాణ కర్ణాటక పరిధిలో కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బీదర్, బళ్లారి, విజయ నగర జిల్లాల అభివృద్ధిని రాష్ట్రంలో అధికారం చేపట్టిన సర్కార్లు ఈ ప్రాంత అభివృద్ధి కోసం బడ్జెట్‌లో ప్రతి ఏడాది రూ.1000 కోట్ల నిధులు కేటాయించారు. ఈ నిధులతో శాసన సభ్యులు రహదారులు, పాఠశాలలు, తాగునీటి పథకాలకు నిధులను వినియోగించుకోవాల్సి ఉంది. మండలికి అధ్యక్షుడిగా శాసన సభ్యుడు అజయ్ సింగ్ నియమితులయ్యారు. కళ్యాణ కర్ణాటకలో విద్యా రంగాభివృద్ధికి కళ్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి అధ్యక్షుడు అజయ్ సింగ్ ప్రణాళికను రూపొందించారు. ప్రతి అసెంబ్లీ పరిధిలో 50 పాఠశాలలు, 10 కళాశాల అభివృద్ధికి అక్షర ఆవిష్కార పథకం అమలుకు శ్రీకారం చుట్టి, దాని అమలుకు రూ.652 కోట్లు కేటాయించారు. పదో తరగతి పరీక్ష ఫలితాల మెరుగునకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తారు. ఈ విషయంలో విద్యా శాఖ కలబుర్గి కమిషనర్ డిగ్రీ కళాశాల విద్యా శాఖ కమిషనర్‌కు నివేదిక పంపారు. ప్రయోగశాల, భవనాల నిర్మాణాలు, మరుగుదొడ్లు, అభ్యాస సామర్థ్యం కల్పించడానికి చర్యలు చేపట్టారు.
ప్రతి అసెంబ్లీలో 50 స్కూళ్లు, 10 కళాశాలల అభివృద్ధి
పదవ తరగతి ఫలితాల మెరుగునకు ప్రత్యేక కమిటీ
అక్షర ఆవిష్కార పథకం శ్రీకారానికి రూ.652 కోట్లు