
నగరాభివృద్ధిపై మంత్రుల నిర్లక్ష్యం
రాయచూరు రూరల్: నగరాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలైన రూ.40 కోట్ల నిధులు రికార్డులకే పరిమితమైనట్లు జిల్లా జేడీఎస్ అధ్యక్షుడు విరుపాక్షి పేర్కొన్నారు. గురువారం పాత్రికేయుల భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని వివిధ సర్కిళ్లలో ఉన్న అంబేడ్కర్, బసవణ్ణ, బాబూ జగ్జీవన్ రామ్ ఉద్యానవనాల అభివృద్ధికి రాయచూరు డెవలప్‌మెంట్ అథారిటీ(ఆర్‌డీఏ) నుంచి ఫిబ్రవరిలో రూ.40 కోట్ల ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం నిధులను మే నెలలో విడుదల చేసిందన్నారు. గత 5 నెలల నుంచి పనులు చేపట్టడానికి టెండర్లు పిలవాల్సిన ఇంజినీర్, మంత్రుల మాటలకు వత్తాసు పలుకుతూ మౌనం వహించారని ఆరోపించారు. జిల్లాధికారి నితీష్, నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రోలు కలిసి రాయచూరును సుందర నగరంగా తీర్చిదిద్దుతామని హామీలిచ్చి మాట తప్పారన్నారు. మంత్రులు శరణ ప్రకాష్ పాటిల్, బోసురాజుల మధ్య అధికారులు ఎవరి మాట వినాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. నగర శాసన సభ్యుడు తనకేమీ పట్టనట్లు వ్యవహరించడాన్ని ఆయన ఖండించారు.
టెండర్ ప్రక్రియపై అధికారుల మౌనం
మాట తప్పిన జిల్లా స్థాయి అధికారులు
రూ.40 కోట్ల నిధులు రికార్డులకే పరిమితం అయ్యాయి
జిల్లా జేడీఎస్ అధ్యక్షుడు విరుపాక్షి ఆరోపణ