
దేశాభివృద్ధికి పెద్దల సలహాలు అవసరం
బళ్లారిటౌన్: దేశాభివృద్ధికి సీనియర్ సిటిజన్ల(పెద్దల) మార్గదర్శకాలు అత్యవసరమని జిల్లా న్యాయ సేవా ప్రాధికార కార్యదర్శి, సివిల్ న్యాయమూర్తి రాజేష్ ఎస్.హొసమని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, మహిళా శిశు సంక్షేమ తదితర శాఖల ఆధ్వర్యంలో గురువారం విశ్వ సీనియర్ సిటిజన్ల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఇటీవల రోజుల్లో సీనియర్ సిటిజన్లను పక్కన పెడుతుండటం విచారకరం అన్నారు. పెద్దలను గౌరవించాలన్నారు. మౌలిక సౌకర్యాలను కల్పించాలన్నారు. సీనియర్ సిటిజన్లకు చట్టపరమైన సమస్యలు ఉంటే జాతీయ న్యాయ సేవా ప్రాధికారకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. జిల్లా గ్యారెంటీ పథకాల అమలు ప్రాధికార అధ్యక్షుడు కేఈ చిదానందప్ప మాట్లాడుతూ మన ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి సీనియర్ సిటిజన్ల కోసం వివిధ పథకాలను చేపట్టారని గుర్తు చేశారు. ఏఎఫ్‌సీ నవీన్‌కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ డీడీ రామకృష్ణ, అధికారులు గోవిందప్ప, సవిత, ఎంటీ మల్లేష్, బీ.వెంకమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన సీనియర్ సిటిజన్లను సన్మానించారు.