
కనకదుర్గా పాహిమాం
●నేడు రావణ దహనం
బళ్లారి అర్బన్: విజయ దశమి వేడుకలను నగరంలోని ఆయా ఆలయాల్లో కనుల పండుగలా జరుపుకున్నారు. బుధవారం సాయంత్రం పోలీస్ స్టేషన్, వివిధ దుకాణాల్లో ఆయుధ పూజ నిర్వహించారు. విజయదశమి రోజున బన్ని చెట్టుకు పూజలు నిర్వహించి పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే విజయాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. 9 రోజుల పాటు ఆలయ ప్రాంగణంలో అమ్మవారి శక్తి పీఠాలను ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం భాగ్యం కల్పించామని దేవస్థాన ఈఓ హనుమంతప్ప, ధర్మకర్త పూజారి గాదెప్ప తెలిపారు. జిలాన్ బాషా, అభిషేక్, బృందం ఆధ్వర్యంలో సాంస్కృతిక నృత్యాలు నిర్వహించారు. ఈ ఏడాది భక్తులకు పార్కింగ్ సౌకర్యం, క్యూ లైన్లు, మహిళలు దీపాలు వెలిగించేందుకు, టెంకాయలు కొట్టె స్థలం ఏర్పాట్లు చేశారు. ఆలయం చుట్టూ నాలుగు రాజ గోపురాలను విద్యుత్ దీపాలతో అలకరించారు.

కనకదుర్గా పాహిమాం