
కులగణన సిబ్బందికి సన్మానం
కోలారు: జిల్లాలో సామాజిక కుల సర్వే 35 శాతం పూర్తయిన సందర్భంగా సిబ్బందిని కలెక్టర్ ఎం ఆర్ రవి అభినందించారు. ప్రతి తాలూకాలో 10 వేల ఇళ్లను ప్రతినిత్యం సమీక్ష నిర్వహించడం జరిగింది. ఎంతో ఉత్సాహంగా సమీక్ష నిర్వహిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన 7వ తేదీ లోగా సమీక్షను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ఎదురవుతున్న సాంకేతిక, ఇతర సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. పలుచోట్ల ప్రభుత్వ కట్టడాలలో శిబిరాలను ఏర్పాటు చేసి కులగణన చేస్తున్నట్లు తెలిపారు. జడ్పీ సీఈఓ ప్రవీణ్ పి బాగేవాడి, డిప్యూటీ కలెక్టర్ ఎస్ ఎం మంగళ తదితరులు పాల్గొన్నారు.