బీమా సొమ్ము కోసం అమాయకుడి బలి | - | Sakshi
Sakshi News home page

బీమా సొమ్ము కోసం అమాయకుడి బలి

Oct 4 2025 2:20 AM | Updated on Oct 4 2025 2:20 AM

బీమా

బీమా సొమ్ము కోసం అమాయకుడి బలి

హొసపేటె: రూ.5.20 కోట్ల బీమా సొమ్ము కోసం అమాయకుడిని చంపి, ప్రమాదంగా చిత్రించిన ఘటన నగర శివార్లలో గత నెల 28న జరిగిందని విజయనగర జిల్లా ఎస్పీ జాహ్నవి తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ విషయంపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టి ఆరుగురిని అరెస్టు చేశారన్నారు. మృతుడిని హొసపేటె కౌల్‌పేటె నివాసి గంగాధర్‌(35)గా గుర్తించారన్నారు. ఆరుగురు నిందితులైన కొప్పళ జిల్లా హొసలింగాపుర గ్రామంలో టింకరింగ్‌ పని చేస్తున్న రవి గోసంగి, హొసపేటె నగరంలోని 29వ వార్డు భగత్‌సింగ్‌నగర్‌ నివాసి పి.అజయ్‌, కిళ్లీ కొట్టు యజమాని రియాజ్‌, నగర యాక్సిస్‌ బ్యాంక్‌ సీనియర్‌ లోన్‌ సెక్షన్‌ మ్యాన్‌, బడావణె వీధి నివాసి ఆర్‌వై యోగరాజ్‌ సింగ్‌, కొప్పళ జిల్లా గంగావతి నగరంలోని ప్రభుత్వ పీయూ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ కృష్ణప్ప, భగత్‌సింగ్‌నగర నివాసమంటున్న హులిగమ్మలను పోలీసులు అరెస్ట్‌ చేశారన్నారు.

మృతుడి పేరున రూ.కోట్లాది పాలసీలు

నేరస్తులు మృతుడు గంగాధర్‌ పేరుతో రూ.5.20 కోట్ల వరకు బీమా పాలసీలను చేయించారన్నారు. ఈ డబ్బును పొందాలనే కోరికతో వారు హత్యకు కుట్ర పన్నారన్నారు. మొదట వారు అతన్ని హొసపేటె సమీపంలోని మునిరాబాద్‌లో చంపి, ఆపై హొసపేటె శివార్లలోని జంబునాథహళ్లి గ్రామానికి వెళ్లే హెచ్‌ఎల్‌సీ రహదారికి తీసుకువచ్చారు. వారు ఒక సెకండ్‌ హ్యాండ్‌ ఎక్సెల్‌ బైక్‌ అద్దెకు తీసుకొని, అతన్ని దానిపై ఎక్కించుకుని కారుతో ఢీకొట్టారు. దానిని ప్రమాదంగా చిత్రీకరించి పారిపోయారు. మృతుడి భార్య ఈ విషయంపై హొసపేటె పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

పక్షవాతంతో బైక్‌ నడపలేడు

మృతుడికి పక్షవాతం సోకి కాళ్లు, చేయి సరిగా పని చేయవని, తన భర్తకు బైక్‌ నడపడం రాదని పోలీసులకు తెలిపిందన్నారు. ఒక వేళ ప్రమాదం జరిగి ఉంటే బైక్‌ తాళంచెవి కారులోనే ఉండి ఉండాలి లేదా నేల మీద ఉండాలి అయితే తాళంచెవి సైడ్‌ బ్యాగ్‌లో ఎందుకు ఉంది? అని అనుమానిస్తున్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నేరానికి ఉపయోగించిన కారు, బైక్‌ను కూడా వారు స్వాధీనం చేసుకున్నారన్నారు. అదనపు ఎస్పీ మంజునాథ్‌, డీఎస్పీ మంజునాథ్‌, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ హులిగప్ప, టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ లఖన్‌ ఆర్‌ మసగుప్పి తదితరులు పాల్గొన్నారు.

రూ.5.20 కోట్ల కోసం హత్య చేసిన నిందితులు

ప్రమాదంగా చూపించడానికి ప్రయత్నించిన ముఠా

వాహనం తాళంచెవి ఆధారంగా నిందితుల గుర్తింపు

ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు

బీమా సొమ్ము కోసం అమాయకుడి బలి1
1/2

బీమా సొమ్ము కోసం అమాయకుడి బలి

బీమా సొమ్ము కోసం అమాయకుడి బలి2
2/2

బీమా సొమ్ము కోసం అమాయకుడి బలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement