అంగన్‌వాడీల్లో ఎల్‌కేజీ విద్యకు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల్లో ఎల్‌కేజీ విద్యకు శ్రీకారం

Oct 4 2025 2:20 AM | Updated on Oct 4 2025 2:20 AM

అంగన్‌వాడీల్లో ఎల్‌కేజీ విద్యకు శ్రీకారం

అంగన్‌వాడీల్లో ఎల్‌కేజీ విద్యకు శ్రీకారం

సాక్షి, బళ్లారి: సాధారణంగా ఇప్పటి వరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టిక ఆహారాన్ని అందించడంతో పాటు చిన్నారుల ఆలనపాలన చూసుకునేందుకు ఆయాలు, అంగన్‌వాడీ టీచర్లు ఎంతో కృషి చేసేవారు. అంతే కాకుండా అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులతో పాటు గర్భిణీలకు, బాలింతలకు కూడా పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ గుర్తింపు పొందింది. అయితే మారుతున్న కాలానుగుణంగా విద్యా వ్యవస్థలో సరికొత్త మార్పులు, చేర్పులు చోటుచేసుకోవడంతో పాటు పేద విద్యార్థులకు ఎల్‌కేజీ విద్య భారంగా మారింది. ఈనేపథ్యంలో పేద విద్యార్థులకు, అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు 0–6 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రాథమికంగా ఎల్‌కేజీ నుంచి విద్యాభ్యాసం చక్కగా అలవర్చుకునేందుకు అంగన్‌వాడీ కేంద్రాలు త్వరలో వేదిక కానున్నాయి. అంగన్‌వాడీలో ఎల్‌కేజీ విద్యాభ్యాసంతో పాటు యూకేజీ విద్యను కూడా ప్రారంభించేందుకు సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారులు గట్టిచర్యలు తీసుకుంటున్నారు.

1350కి పైగా కేంద్రాల్లో ఏర్పాట్లు

జిల్లాలో బళ్లారి, సిరుగుప్ప, కురుగోడు, కంప్లి, సండూరు ఐదు తాలూకాల పరిధిలో దాదాపు 1350కి పైగా అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 0–6 ఏళ్ల లోపు చిన్నారులకు, గర్భిణులకు పౌష్టిక ఆహారాన్ని అందింస్తుండటంతో పాటు అరకొరగా ఏబీసీడీలు నేర్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అంగన్‌వాడీ కేంద్రాల నుంచే ఎల్‌కేజీ విద్యను అందిస్తే విద్యార్థుల బంగారు బాటకు దారులు ఏర్పడుతాయని అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో 1350కి పైగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో తొలిదశలో 75 కేంద్రాల్లో ఎల్‌కేజీ విద్యాభ్యాసాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో బళ్లారి గ్రామీణ 23, సిరుగుప్ప 14, సండూరు 18, బళ్లారి నగర 20, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎల్‌కేజీ విద్యను అందించేందుకు అధికారులు గుర్తించారు. వీరిలో 4–5 సంవత్సరాల లోపు వయస్సుగల చిన్నారులు 969, 5–6 సంవత్సరాల లోపు వయస్సుగల చిన్నారులకు ఎల్‌కేజీ విద్యను అందించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు.

త్వరలో ప్రారంభానికి సర్కార్‌ సన్నాహాలు

చిన్నారులకు విద్యా బోధనకు గట్టి చర్యలు

సిబ్బందికి తగిన శిక్షణకు చర్యలు

అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎల్‌కేజీ, యూకేజీ విద్యను ప్రారంభించే నేపథ్యంలో అందులో పని చేసే సిబ్బందికి అందుకు సంబంధించిన శిక్షణను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 10వ తరగతి, పీయూసీ, డిగ్రీ పూర్తి చేసిన అంగన్‌వాడీ కార్యకర్తలకు అధికారులు తగిన శిక్షణను ఇచ్చేందుకు శ్రీకారం చుట్టారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎల్‌కేజీ విద్యను ప్రారంభించనున్న నేపథ్యంలో ఆయా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎల్‌ఈడీ టీవీ, ఆట సామగ్రి, సంబంధిత పుస్తకాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అధికారులు సూచిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎల్‌కేజీ, యూకేజీ విద్యను దశల వారిగా విస్తరిస్తామని తెలిపారు. ప్రస్తుతం 75 కేంద్రాల్లో ఎల్‌కేజీ విద్యా బోధన ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నామని, చిన్నారులకు ఇది ఎంతో ఉపయోగపడనుందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement