
క.క.లో భారీ వర్షాలు.. పంటల సాగు కుదేలు
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు అధికంగా కురవడంతో రైతులు, వ్యవసాయ కూలీలు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. రాయచూరు, యాదగిరి, కొప్పళ, బీదర్, కలబుర్గి జిల్లాల్లో ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయం రంగంపై వరుణ దేవుడు కక్ష కట్టాడు. భారీ వర్షాలు కురిసి పంటలు నీట మునిగి కుళ్లిపోయాయి. చేతికొస్తున్న పంటలు నీట మునిగి రైతుల జీవనోపాధికి మట్టికొట్టినట్లయింది. రాయచూరు, యాదగిరి, బీదర్, కలబుర్గి జిల్లాల ప్రజలు ప్రతి ఏడాది ఏదో ఒక సాకుతో వ్యవసాయం కుదేలు కావడంతో రైతులను కదిలిస్తే కళ్లలో కన్నీరు వస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు అధికమై వేలాది ఎకరాల్లో పంటలను పీకివేశారు. ఆయా జిల్లాల్లో భారీ వర్షాలకు 200 ఇళ్లు కుప్పకూలాయి. వేలాది ఎకరాల్లో పెసలు, మినుములు, కంది, పత్తి పంటలు నీట మునిగాయి. మరో వైపు కురిసిన వానలకు ప్రధాన రహదారులు కోతకు గురయ్యాయి.
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
జిల్లాలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను సర్కార్ ఆదుకోవాలని రైతు సంఘం అధ్యక్షుడు శివార్జున నాయక్ డిమాండ్ చేశారు. ఎడతెరిపి లేకుండా అకాల వర్షాలు పడినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. రాజకీయాలు తప్ప రైతు ప్రయోజనాలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మేల్కొని అన్నదాతలను ఆదుకోవాలన్నారు.
వ్యవసాయ రంగానికి
వరుణదేవుడి శాపం
వేలాది ఎకరాల్లో పంటలు
నీటమునిగిన వైనం

క.క.లో భారీ వర్షాలు.. పంటల సాగు కుదేలు

క.క.లో భారీ వర్షాలు.. పంటల సాగు కుదేలు

క.క.లో భారీ వర్షాలు.. పంటల సాగు కుదేలు

క.క.లో భారీ వర్షాలు.. పంటల సాగు కుదేలు