
ఘనంగా గాంధీ జయంతి
రాయచూరు రూరల్ : నగరంలో మహాత్మా గాంధీ, లాల్‌బహద్దూర్ శాస్త్రి జయంతులను ఘనంగా ఆచరించారు. మహాత్మ గాంధీజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. నగరసభభ అధ్యక్షురాలు నరసమ్మ, జిల్లాధికారి నితీష్, ఎస్పీ పుట్టమాదయ్య, కమిషనర్ జుబిన్ మహాపాత్రో, నగరసభ ఉపాధ్యక్షుడు సమీర్, సభ్యులు జయన్న, బసవరాజ్, రవీంద్ర, శశిరాజ్ పాల్గొన్నారు.
రైతు సమస్యలపై స్పందిస్తాం
రాయచూరు రూరల్: ఇటీవల కురిసిన వర్షాలకు రాయచూరు గ్రామీణ ప్రాంతంలో వరదలకు నష్టానికి గురైన పంటలకు రైతులకు పరిహారం అందించడంపై సమీక్ష జరిపి సర్కార్, మంత్రులు స్పందిస్తారని గ్రామీణ శాసన సభ్యుడు బసన గౌడ దద్దల్ పేర్కొన్నారు. శుక్రవారం రాయచూరు తాలూకా దేవసూగూరు, చిక్కసూగూరు, చంద్రబండ ప్రాంతాల్లో పత్తి పంటను పరిశీలించారు. రైతుల సమస్యలపై అధికారులు సత్వరం స్పందించాలని సూచించారు. సక్రమంగా సర్వే చేసి బాధిత రైతులకు పరిహారం అందించాలన్నారు.
చెరువు అభివృద్ధి
పనులపై సమీక్ష
రాయచూరు రూరల్ : నగరంలోని మావినకెరె చెరువు అభివృద్ధి పనులపై కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి సుభోద్ యాదవ్ సమీక్ష చేపట్టారు. శుక్రవారం కోట్లాది రూపాయలతో చేయనున్న చెరువు అభివృద్ధి పనుల గురించి అధికారుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. సిరవార, మాన్వి, మస్కి, కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు. తల్లీబిడ్డల ఆస్పత్రిలో సౌకర్యాల గురించి ఆరా తీశారు. ఆయన వెంట నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో, జెడ్పీ అధికారి రోణ, సౌమ్యలున్నారు.
అన్నదానం
బళ్లారి అర్బన్: దేవీ శరన్నవరాత్రి దసరా పండుగను దాదాపు 11 రోజుల పాటు స్థానికులు ఘనంగా నిర్వహించారు. ప్రధానంగా ఇక్కడి పటేల్ నగర్ వేంకటేశ్వర దేవస్థానం ఎదురుగా ఉన్న బన్ని మహంకాళమ్మ దేవస్థానంలో బాలాజీ యువక సంఘం అధ్యక్షుడు రాజేష్ ఆధ్వర్యంలో మహంకాళమ్మ దేవికి విశేష పూజలు, అన్నదానం చేశారు. వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ తాను, తమ బృందం గత 25 ఏళ్లుగా నవరాత్రి వేడుకల సమయంలో భక్తిశ్రద్ధలతో పూజలు జరిపి, విశేషంగా అన్నదానం చేపట్టామన్నారు. 20వ వార్డు పరిధిలోని వేంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఈ నవరాత్రి వేడుకల్లో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారన్నారు. తమ వార్డు కార్పొరేటర్ పేరం వివేక్ తమ కుటుంబ సభ్యులతో వచ్చి ప్రత్యేక పూజలను నెరవేర్చారన్నారు. సంఘం ప్రముఖులు జీబీటీ రాజు, బీజీ చంద్ర, హులుగప్ప, దేవినగర్ శీన, రంగనాయకులు, రామాంజిని తదితరులు పాల్గొన్నారు.
అహింసా మార్గమే
గాంధీజీ ఆయుధం
హొసపేటె: సత్యం, అహింస, సమానత్వాన్ని ప్రపంచానికి ప్రబోధించిన గొప్ప రాయబారి, గర్వించదగ్గ జాతిపిత మహాత్మాగాంధీ విశ్వ పురుషుడయ్యారని అసిస్టెంట్ కమిషనర్ పి.వివేకానంద అన్నారు. గురువారం నగరంలోని జిల్లాధికారి కార్యాలయ సభామందిరంలో నిర్వహించిన మహాత్మా గాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. బ్రిటిష్ వారిపై అహింసాయుతంగా పోరాడి దేశాన్ని బానిసత్వం నుంచి విముక్తి చేసిన గొప్ప యోధుల్లో ఒకరైన మహాత్మా గాంధీజీ తన సిద్ధాంతాలతో ప్రపంచమంతటా అహింసను వ్యాపింపజేయడం ద్వారా మహాత్ముడయ్యాడన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి త్యాగం, ఆత్మగౌరవం ఆదర్శప్రాయమైనవి. ఈ ఇద్దరు మహానుభావుల తత్వాలను నేటి యువత స్వీకరించాలి అని అన్నారు. టీబీ డ్యాం పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వి.నారాయణ, జిల్లాధికారి కార్యాలయ ఆడిటర్ శ్రీనివాస్, సమాచార శాఖ సిబ్బంది రామాంజనేయ, అశోక్ ఉప్పర, తాయేష్, తిప్పేష్, దేవరాజ్, కృష్ణస్వామి, విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఘనంగా గాంధీ జయంతి

ఘనంగా గాంధీ జయంతి

ఘనంగా గాంధీ జయంతి