
జయ జయ మహిషాసుర మర్దినీ
బళ్లారి అర్బన్: దసరా శరన్నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు బుధవారం నగరంలోని వివిధ ఆలయాల్లో అమ్మవార్లు మహిషాసుర మర్దినీ దేవిగా దర్శనమిచ్చారు. పటేల్ నగర్ చిన్నదుర్గమ్మ ఆలయంలో అమ్మవారు మహిషాసుర మర్ధిని, హవంబావి సీతారామ ఆశ్రమంలో మహకాళికా దేవిగా, బెంగళూరు రోడ్డు కన్యకా పరమేశ్వరి దేవస్థానం సంతాన లక్ష్మీ ఆలయ ప్రాంగణంలో గాయత్రి దేవి అలంకరణ, నగరేశ్వరి ఆలయంలో మహిషాసుర మర్దినీ, బెంకి మారెమ్మ ఆలయంలో మహకాళి అలంకరణ, మిల్లర్‌పేట్ మల్నాడు దుర్గమ్మ ఆలయంలో అమ్మవారు మహిషాసుర మర్దిని భక్తులకు దర్శనమిచ్చారు. సిరుగుప్ప రోడ్డు తొలిజ భవానికి యల్లమ్మ దేవి అలంకరణ, ఏళ్లు మక్కళతాయమ్మ ఆలయం, ఫైల్ ఆఫీసు ఆదిశక్తి ఆలయం, దేవినగర్ రేణుకా యల్లమ్మ ఆలయం, కొళ్లాపుర మహాలక్ష్మి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది.
అమ్మవార్లకు విశేష పూజలు
రాయచూరు రూరల్: నగరంలోని కిల్లే బ్రహన్మఠంలో అంభా భవాని మాతకు వెండి అలకరించి ప్రత్యేక పూజలు జరిపారు. కందగడ్డ మారెమ్మ దేవి, కోటలోని కాళికా దేవిని ప్రత్యేకంగా అలంకరించారు. రాత్రి పల్లకీ సేవ నిర్వహించారు. నగరేశ్వరాలయం, ఉప్పారవాడి లక్ష్మీ వేంకటేశ్వర ఆలయం, కన్యకా పరమేశ్వర ఆలయంలో అశ్వ వాహనంలో అమ్మవారిని ఊరేగించారు. అంబ దేవాలయంలో చండీ హోమం నిర్వహించారు. కిల్లేరి మఠంలో శాంతమల్ల శివాచార్యులు బాల ముత్తయిదువులకు ఒడి బియ్యం అందజేశారు.
విశేష అలంకరణలో చిన్నదుర్గమ్మ, కాళికా దేవి, బాల మారెమ్మ, హుబ్లీలో దుర్గామాత

జయ జయ మహిషాసుర మర్దినీ

జయ జయ మహిషాసుర మర్దినీ

జయ జయ మహిషాసుర మర్దినీ