
విమానాశ్రయంలో దసరా సంబరాలు
దొడ్డబళ్లాపురం: దసరా నేపథ్యంలో కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రయాణికులను అలరించాయి. దేశ, విదేశీ ప్రయాణికులకు మైసూరులో జరిగే దసరా ఉత్సవాలను కళ్లకు కట్టినట్టు చూపేందుకు విమానాశ్రయ అధికారులు ఈ కార్యక్రమాలు నిర్వహించారు. రెండు టర్మినల్స్‌లోనూ గత నెల 22 నుండి దసరా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. రోజూ ఒక సాంస్కృతిక, సంగీత విభావరీ ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఆనందాన్ని పంచుతున్నారు. విమానాశ్రయ మహిళా సిబ్బందికి ముగ్గుల పోటీలు నిర్వహించారు.

విమానాశ్రయంలో దసరా సంబరాలు

విమానాశ్రయంలో దసరా సంబరాలు