
రాష్ట్రంలో ఏడాదిలోపు సర్కార్ పతనం
రాయచూరు రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏడాది లోపు పతనం అవుతుందని విజయపుర శాసన సభ్యుడు బసవనగౌడ పాటిల్ యత్నాళ్ జోస్యం చెప్పారు. మంగళవారం రాత్రి 21వ రోజు హిందూ మహా గణపతి నిమజ్జనాల సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలు పోలీసులకు భయపడడం లేదన్నారు. నేపాల్‌లో జరిగినట్లు రాష్ట్రంలోనూ అలజడులు చెలరేగుతాయన్నారు. హిందువులు ఏడాదికొకసారి జరుపుకునే గణపతి ఉత్సవాలకు డీజేను నిషేధించడం సమంజసం కాదన్నారు. 2028లో హిందూ సర్కార్ ఏర్పాటవుతుందన్నారు. రాత్రి 10 గంటల నుంచి ప్రారంభమైన వినాయకుడి ఊరేగింపు తీన్ కందిల్ నుంచి సూపర్ మార్కెట్, మహావీర్ చౌక్, మహాబళేశ్వర చౌక్, షరాఫ్ బజారు, పేట్లా బురుజు మీదుగా ఖాస్‌బావి వరకు డీజే శబ్దంతో నృత్యం చేస్తూ గణనాథుడిని నిమజ్జనం చేశారు.
రాయచూరులో బసవనగౌడ పాటిల్ యత్నాళ్ జోస్యం
21వ రోజున హిందూ మహా గణపతి నిమజ్జనం

రాష్ట్రంలో ఏడాదిలోపు సర్కార్ పతనం