
మైనర్ కాదు.. కిల్లర్
యశవంతపుర: మొబైల్‌ఫోన్లు, అందులో లభ్యమయ్యే చెత్త కంటెంట్ బాలలను పెడదోవ పట్టిస్తోంది. అలాంటిదే ఈ సంఘటన. మైనర్ బాలుడు ఒకరు తమ ఇంటిలో పనిచేసే మహిళపై లైంగికదాడికి పాల్పడి అత్యంత పాశవికంగా హతమార్చాడు. ఈ దుర్ఘటన హాసన్ జిల్లాలో అరసికెరె తాలూకా జవగళ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బందూరు గ్రామంలో జరిగింది.
నిర్మానుష్య ప్రదేశంలో..
గ్రామస్తులు, పోలీసులు తెలిపిన మేరకు.. మహిళ (43) ఓ రైతు ఇంట్లో పనిచేస్తోంది. అదే ఇంట్లో రైతు బంధువైన 17 ఏళ్లు బాలుడు ఉంటున్నాడు. అతని తల్లిదండ్రులు గతంలో చనిపోగా రైతు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. గత సోమవారం ఉదయం ఆమెతో బియ్యం కొనాలని దూరంగా ఉండే అంగడికి నడుచుకుంటూ వెళ్లారు. ఆ సమయంలో బాలుడు కూడా ఆమె వెంట వెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతంలో అతడు ఆమెను ఓ పొలంలోకి లాక్కువెళ్లి అత్యాచారం చేశాడు, ఆ విషయం అందరికీ చెబుతుందనుకుని బండరాయితో తలపై కొట్టి, ఆపై చెట్టు కొమ్మతో చితకబాది చంపేసి, ఆమె మొబైల్‌ఫోన్‌ను తీసుకుని వెళ్లిపోయాడు.
మరుసటి రోజు వరకు తల్లి కనబడకపోవడంతో ఆమె కొడుకు దినేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాలించగా పొలంలో మృతదేహం కనిపించింది. మైనర్ కావడంతో మొదట బాలునిపై ఎలాంటి అనుమానం రాలేదు. దినేశ్ ఫిర్యాదుతో అతనిని తమదైనశైలిలో విచారణ చేయగా తప్పు ఒప్పుకున్నాడు. హంతకున్ని అరెస్ట్ చేశారు. హత్య పె లోతుగా విచారిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహమ్మద్ సుజీత తెలిపారు. ఈ సంఘటన గ్రామంలో భయాందోళన కలిగిస్తోంది.
ఇంటి పనిమనిషిపై అత్యాచారం, హత్య
హాసన్ జిల్లాలో కిరాతకం

మైనర్ కాదు.. కిల్లర్