
రిజర్వేషన్లను పెంచకుంటే యుద్ధమే
శివాజీనగర: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో తమకు అన్యాయం జరిగిందని, నాగమోహన్‌దాస్ నివేదికను రద్దు చేయాలని బంజార, కొరమ, కొరచ, భోవి సామాజిక వర్గపు జనం, నాయకులు భారీఎత్తున ధర్నా చేపట్టారు. బుధవారం బెంగళూరు ఫ్రీడం పార్కులో జరిగిన ఈ ధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి తరలవచ్చారు. కొందరు అక్కడే గుండు గీయించుకొని, నోర్లు కొట్టుకుంటూ వినూత్నంగా నిరసన తెలిపారు. కొందరు టైర్లకు నిప్పు పెట్టారు. గురువారం జరిగే కేబినెట్ భేటీలో నాగమోహన్‌దాస్ నివేదికను రద్దుచేసి, తమ వర్గాలకు శాసీ్త్రయంగా రిజర్వేషన్‌లను పెంచాలని డిమాండ్ చేశారు. ఆయా సముదాయాల నాయకులు ప్రభుత్వం మీద ధ్వజమెత్తారు. తమ వర్గాలకు ప్రత్యేకంగా 5 శాతం అంతర్గత రిజర్వేషన్‌ను ఇవ్వాలి అని పలు డిమాండ్లను వినిపించారు. వాస్తవ జనసంఖ్య ఆధారంగా కేటాయించాలన్నారు. సీఎం, డీసీఎంలు నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
బంజార, కొరమ, బోవి వర్గాల ధర్నా

రిజర్వేషన్లను పెంచకుంటే యుద్ధమే