
సీఎం ఇంటి సమీపంలో క్యాబ్ దగ్ధం
శివాజీనగర: బెంగళూరులో సీఎం సిద్దరామయ్య నివాసం సమీపంలో క్యాబ్ దగ్ధం కాగా డ్రైవర్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. శుక్రవారం ఓ వ్యక్తి యాప్‌లో కారు బుక్ చేయగా అతను చెప్పిన చోటుకు వాహనం బయల్దేరింది. సరిగ్గా సీఎం అధికార నివాసం సమీపంలోకి రాగానే ఇంజిన్‌లో పొగ వచ్చింది. డ్రైవర్ కిందకు దిగి పరిశీలిస్తుండగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అర్పారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.
భార్య వదిలి వెళ్లిందని
నదిలోకి దూకిన భర్త
● గాలిస్తున్న పోలీసులు
దొడ్డబళ్లాపురం: పిల్లలను తీసుకుని భార్య పుట్టింటికి వెళ్లిపోయిందనే మనస్తాపంతో భర్త నదిలోకి దూకి గల్లంతయ్యాడు. ఈ ఘటన బీదర్ జిల్లా భాల్కి తాలూకా హలసితూగాంవ్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామ నివాసి ప్రభాకర్ సూర్యవంశి(38) భార్య భర్తతో గొడవపడి కొన్నేళ్లక్రితం పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. పలుమార్లు అభ్యర్థించినా ఆమె ఇంటికి రాకపోవడంతో ప్రభాకర్ సూర్యవంశి మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం 30 అడుగుల బ్రిడ్జిపై నుంచి మాంజ్రా నదిలోకి దూకాడు. ఈ దృశ్యాలను కాస్త దూరంలో ఉన్న వారు మొబైల్‌లో వీడియో తీశారు. అగ్నిమాపకదళం సిబ్బంది, పోలీసులు వచ్చి గాలింపు చేపట్టారు. శుక్రవారం సాయంత్రం వరకు ఆచూకీ లభించలేదు.