
టీచర్‌పై అమానుష దాడి
● తరగతి గది నుంచి లాక్కొచ్చి
దాడి చేసిన గ్రామస్తుడు
● కోలారు జిల్లాలో ఘటన
మాలూరు : ఉపాధ్యాయురాలిని తరగతి గది నుంచి బయటకు లాక్కొని వచ్చి అమానుషంగా దాడికి పాల్పడిన ఘటన శుక్రవారం కోలారు జిల్లా మాలూరు తాలూకాలోని టీకల్ ఫిర్కా క్షేత్రేనహళ్లి గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగింది. ఉపాధ్యాయిని ఎస్.మంజుల విద్యార్థులకు పాఠాలు చెబుతుండగా గ్రామానికి చెందిన చౌడప్ప వచ్చాడు. మీ అబ్బాయి రెండు రోజులుగా బడికి రాలేదని మంజుల తెలియజేయగా కోపోద్రిక్తుడైన చౌడప్ప ఆమెను గదిలోనుంచి లాక్కువచ్చి దాడి చేశాడు. దాడిలో మంజుల తలకు తీవ్ర గాయమైంది. ఆమెను మాలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. మాస్తి పోలీసు పోలీసులు పాఠశాలకు వచ్చి వివరాలు సేకరించారు. ఘటనను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఉపాధ్యాయుల సంఘం తీవ్రంగా ఖండించింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా దాడి పాల్పడిన చౌడప్ప కుటుంబం ప్రస్తుతం పరారీలో ఉంది.

టీచర్‌పై అమానుష దాడి