
అంత్యక్రియల దాఖలాల కోసం సిట్ దర్యాప్తు
బనశంకరి: ధర్మస్థలలో శవాలు పూడ్చి పెట్టిన కేసు దర్యాప్తు చేపడుతున్న సిట్ అధికారులు ధర్మస్థల గ్రామపంచాయతీ పరిధిలో మృతదేహాలకు అంత్యక్రియలు చేసిన రికార్డులపై దృష్టి సారించి దర్యాప్తు చేపడుతున్నారు. ధర్మస్థల గ్రామ పంచాయతీ పరిధిలో మృతదేహాల అంత్యక్రియల్లో అక్రమాలు జరిగాయని, శవాలు పూడ్చిపెట్టడానికి ఫోర్జరీ రికార్డులు సృష్టించారని పోరాటదారుడు గిరీశ్ మట్టణ్ణవర్ ఆరోపిస్తూ సిట్ కార్యాలయానికి పలు దాఖలాలు అందజేశారు. దీంతో పంచాయతీ కార్యాలయంలో రికార్డుల పరిశీలనకు సిట్ సిద్ధమైంది. ప్రతి రోజూ ధర్మస్థల పంచాయతీ నుంచి రికార్డులు తెప్పించుకున్న సిట్, శవాలు పూడ్చిపెట్టిన వివరాలు, యూడీఆర్, రశీదుల సమాచారం సేకరిస్తోంది. 1987 నుంచి 2025 వరకు అన్ని రికార్డులు సేకరించిన సిట్ అధికారులు గిరీశ్‌మట్టణ్ణవర్ ఇచ్చిన రికార్డులు, పంచాయతీ రికార్డులను పరిశీలిస్తున్నారు.
రికార్డుల్లో సంతకాలపై విచారణ
శవాలు పూడ్చిపెట్టిన సమయంలో రికార్డుల్లో సంతకం పెట్టిన వ్యక్తులను విచారణ చేపట్టడంతో మాజీ అధ్యక్షులు, పీడీఓ, సిబ్బంది ప్రతిరోజు విచారణ చేపడుతోంది. దీంతో ధర్మస్థల పుర్రె కేసులో ఆరోపణలకు స్పష్టత ఇవ్వడానికి సిట్ సిద్ధంమైంది. తల పుర్రె కేసుకు సంబంధించి బంగ్లగుడ్డె రహస్యం వెలుగులోకి తీసుకురావడానికి సిట్ అధికారులు రహస్యంగా సోదాలు చేస్తున్నారు. గురువారం సాయంత్రం బంగ్లగుడ్డెలో సిట్ సీనియర్ అధికారి సైమన్ నేతృత్వంలో సోదాలు నిర్వహించారు. విఠల్‌గౌడ ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. విఠల్‌గౌడను బంగ్లగుడ్డెలో రెండు చోట్లకు సిట్ అధికారులు తీసుకెళ్లి పరిశీలించగా అక్కడ మూడు అస్థిపంజరాలు లభించాయి. రెండోసారి వెళ్లగా మృతదేహాల రాశి, చిన్నారి అస్థిపంజరం కనబడిందని విఠల్‌గౌడ తెలిపారు.
మరోసారి మహేశ్‌శెట్టి తిమరోడి ఫిర్యాదు
ధర్మస్థల ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టాలని సిట్ పోలీస్ స్టేషన్‌లో మహేశ్‌శెట్టి తిమరోడి కొత్తగా మరోసారి ఫిర్యాదు చేశారు. 2006 నుంచి 2010 వరకు ధర్మస్థలలోని గాయత్రి, శరావతి, వైశాలి వసతిగృహాల్లో అనేక అనుమానాస్పద మృతులు సంభవించాయి. కానీ గుర్తు తెలియని శవాలను అనాథ శవాలుగా ప్రకటించారని, తక్షణం గ్రామపంచాయతీ ద్వారా సమాధి చేశారని తెలిపారు. అతిథిగృహంలో వ్యక్తి సమాచారం వివరాలు తీసుకుంటారు కానీ అతిథుల వివరాలు ఉద్దేశపూర్వకంగా దాచిపెడతారని లేదా రికార్డులు నాశనం చేస్తారని తీవ్ర అనుమానం ఉందన్నారు. ప్రత్యేక ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని తిమరోడి మనవి చేశారు.
జయంత్, గిరీశ్‌మట్టణ్ణవర్‌పై ప్రశ్నల వర్షం
జయంత్, గిరీశ్‌మట్టణ్ణవర్‌ను సిట్ అధికారులు విచారణ చేపట్టారు. గురువారం విచారణ పూర్తి చేసుకుని బయలుదేరిన సమయంలో మాట్లాడిన జయంత్ తనను సిట్ అధికారులు కొట్టలేదని వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని తెలిపారు. నేను తప్పు చేసినట్లయితే కచ్ఛితంగా శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని, దర్యాప్తులో నిజం వెలుగులోకి వస్తుందన్నారు. బంగ్లగుడ్డెకు వెళ్లి రెండుసార్లు స్థల పరిశీలన చేపట్టగా, శవాల రాశి కనబడింది. మూడు కళేబరాలు లభించాయని, చిన్నయ్య చెప్పింది నూటికి నూరు శాతం నిజమని తలపుర్రె కేసులో సౌజన్య మామ విఠల్‌గౌడ వీడియో విడుదల చేశారు.
సిట్ కార్యాలయంలో తీవ్ర విచారణ
తలపుర్రె కేసులో శుక్రవారం సిట్ అధికారులు పలు ప్రశ్నలతో గిరీశ్‌మట్టణ్ణవర్, జయంత్, యూట్యూబర్ ప్రదీప్‌లను బెళ్తంగడి సిట్ కార్యాలయంలో తీవ్ర విచారణ చేపట్టారు. చిన్నయ్య ఇచ్చిన సమాచారం ఆధారంగా పైముగ్గురు వ్యక్తులను విచారణ చేపట్టి సమాచారం సేకరించారు.
ధర్మస్థల వద్ద అక్రమాలపైనే దృష్టి
సమాచారం సేకరిస్తున్న అధికారులు