
దాస్ నివేదికను తిరస్కరించాలి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జిస్టిస్ నాగమోహన్‌దాస్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను తిరస్కరించాలని కర్ణాటక మాదిగ, ఉప కులాల ఎస్సీ వర్గీకరణ సమితి సంచాలకుడు విరుపాక్షి డిమాండ్ చేశారు. మంగళవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఆందోళన చేపట్టి మాట్లాడారు. ఏబీసీడీ వర్గీకరణలో కాంగ్రెస్ సర్కార్ వర్గీకరణకు జిస్టిస్ నాగమోహన్ దాస్ నివేదికను అందించారన్నారు. కమిటీలో ఎస్సీ వర్గాలకు చెందిన వారిని నియమించకుండా అగ్ర వర్ణాల వారిని కమిషన్ అధ్యక్షుడిగా నియమించడంతో లోపాలు ఏర్పడ్డాయన్నారు. ఆది కర్ణాటక, ద్రావిడ ఇతర ఉప కులాలను చేర్చడంలో లోపాలున్నాయని, వాటిని సవరించాలన్నారు. సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మహదేవప్పను స్థానభ్రంశం చేయాలని, అధికారులు మణివణ్ణన్, రాకేష్ కుమార్, వెంకటయ్యలను బదలీ చేయాలని కోరారు.