
దురలవాట్లకు దూరంగా ఉండాలి
బళ్లారి రూరల్ : యువత మద్యం, మాదకద్రవ్యాల వ్యసనాలకు దూరంగా ఉండాలని దావణగెరె జెడ్పీ సీఈఓ గిత్తమాధవ విఠలరావు తెలిపారు. మంగళవారం జెడ్పీలోని ఎస్.ఎస్.సభాభవన్‌లో ఏర్పాటు చేసిన మాదక ముక్త కర్ణాటక కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. యువత ఆరంభంలో కుతూహలంగా మద్యాన్ని, మాదక ద్రవ్యాలను సేవించి తరువాత వాటికి బానిసలై జీవితాలను, భవిష్యత్తును నాశనం చేసుకొంటున్నారన్నారు. మద్యం, మాదక ద్రవ్యాలను సేవించడం వల్ల శారీరక, మానసిక అనారోగ్యంతో మరణాలకు చేరువవుతున్నారని తెలిపారు. మాదక ద్రవ్యాల అమ్మకాలు, రవాణాల అడ్డుకట్టకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చట్టాలను తీసుకొచ్చిందన్నారు. అధికారులు పాఠశాలలు, ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలల వద్ద గట్టినిఘాలు ఏర్పాటుచేయాలని తెలిపారు.ఈ సందర్భంగా జెడ్పీ యోజన సంచాలకులు రేష్మా కౌసర్ యువత వ్యసనాలను వీడాలన్నారు. కార్యక్రమంలో డీహెచ్‌ఓ డాక్టర్ డి.రాఘవన్, టీటీపీ ఐ.కొట్రేశ్ తదితర అధికారులు పాల్గొన్నారు.