
కొత్త బస్టాండ్‌కు హైటెక్ హంగులు
హుబ్లీ: ఉత్తర కర్ణాటక ప్రముఖ వాణిజ్య నగరి హుబ్లీకి వ్యాపార వ్యవహారాలు, ఆరోగ్యం, విద్యా రంగాల్లో సాయం కోసం వివిధ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి నిత్యం వేలాది మంది ఇక్కడకు వచ్చి పోతుంటారు. దీంతో ప్రయాణికుల అనుకూలం కోసం హుబ్లీ గోకుల్ రోడ్డులోని కేంద్ర కొత్త బస్టాండ్‌లో ఆధునీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆ మేరకు త్వరలోనే ఈ సౌకర్యాలు ప్రయాణికులకు లభించనున్నాయి. రూ.23 కోట్ల వ్యయంతో సదరు పనులు ప్రారంభం అయ్యాయి. ప్రాథమిక దశలోనే ఈ బస్టాండ్ ప్రస్తుతం స్మార్ట్‌గా కనిపిస్తోంది. ఎన్నో సౌకర్యాలు కల్పించడంతో ప్రయాణికులు సంతృప్తి చెందుతున్నారు. ఈ బస్టాండ్ భవనం నిర్మించి 23 ఏళ్లయింది. రాష్ట్రేతర, అలాగే జిల్లా నుంచి పొరుగు జిల్లాలకు వెళ్లే బస్సులు ఇక్కడికి వచ్చి వెళుతుంటాయి.
అరకొరగా మౌలిక సౌకర్యాలు
అయితే ఇక్కడికి వచ్చే ప్రయాణికులు కూర్చొనేందుకు అవసరమైన కుర్చీలు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు సరిగా ఉండేవి కావు. మొత్తానికి అక్కడ ఆధునిక సౌకర్యాలకు మెరుగులద్దుతూ చూడముచ్చటగా వసతుల ఏర్పాటుతో ప్రయాణికులను అలరించనుంది. ఈ విషయమై వాయువ్య కేఆర్‌టీసీ ఎండీ ఎం.ప్రియాంక మాట్లాడుతూ సదరు బస్టాండ్ అభివృద్ధి పనులు చురుగ్గా సారుగుతున్నాయి. డల్ట్ సహకారంతో, సంస్థ ఆర్థిక నిధులతో ఈ పనులు చేపట్టాం. ఇందుకు రూ.23 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. సిటీ బస్సుల రాకపోకలకు ప్లాట్‌ఫాం నిర్మాణ ప్రక్రియ ముగిసిందన్నారు. రెండు చోట్ల ఆ బస్సులు నిలిపేలా ప్లాట్‌ఫాం అభివృద్ధి చేశామన్నారు. బస్టాండ్ ఎదుట సౌందర్యీకరణకు ప్రాధాన్యతను ఇచ్చామన్నారు. ఆ మేరకు అక్టోబర్ చివరి కల్లా పనులన్నీ పూర్తి చేసి బస్టాండ్ ప్రారంభించడానికి కృషి చేస్తామని ఆమె వివరించారు.
రూ.23 కోట్ల వ్యయంతో వివిధ సౌకర్యాలు
చురుగ్గా సాగుతున్న ఆధునికీకరణ పనులు

కొత్త బస్టాండ్‌కు హైటెక్ హంగులు