
విజయనగర జిల్లాధికారిణిగా కవితా ఎస్.మణికేరి
హొసపేటె: రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన పనిని మరింత వేగవంతం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రణదీప్‌కు గ్రామీణ తాగునీరు, పారిశుధ్య శాఖ అదనపు కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. రిజర్వ్‌లో ఉన్న కవితా ఎస్.మణికేరిని విజయనగర జిల్లా కమిషనర్‌గా నియమించగా, ఇప్పటి వరకు ఇక్కడ పని చేస్తున్న ఎంఎస్.దివాకర్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. నూతన జిల్లాధికారికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ పుష్ప గుచ్ఛాన్ని అందించి అభినందించారు.
పోలీసు శాఖకు బ్యారికేడ్ల వితరణ
హుబ్లీ: కేఎల్‌ఈ ఆస్పత్రి, వైద్య పరిశోధన కేంద్రం, జేజీఎంఎం వైద్య కళాశాల ఆధ్వర్యంలో మెడికో లీగల్ కేసుల గురించి సదస్సును నిర్వహించారు. నిపుణులుగా హుబ్లీ ధార్వాడ పోలీస్ కమిషనర్ ఎన్.శశికుమార్, డాక్టర్ శారద, డాక్టర్ సునీల్, డాక్టర్ సమీర్, డాక్టర్ భరత్, డాక్టర్ మల్లికార్జున పాల్గొన్నారు. ట్రాఫిక్ సజావుగా సాగడానికి వీలుగా పోలీస్ శాఖకు వంద బ్యారికేడ్లను కేఎల్‌ఈ సంస్థ వితరణ చేసింది. ఆ సంస్థ పాలక మండలి సభ్యుడు శంకరణ్ణ మునవళ్లి బ్యారికేడ్లను పోలీస్ శాఖకు అందజేశారు. గబ్బూరు సమీపంలో నిర్మిస్తున్న కేఎల్‌ఈ ఆస్పత్రి ఆ ప్రాంత రోగులకు ఎంతో అనుకూలం కానుందని, అలాగే ఈ ప్రాంతం అందాన్ని రెట్టింపు చేసిందని అన్నారు.
పేదలకు ఇళ్లు పంపిణీ చేపట్టండి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం నగరంలోని పేదలకు ఇళ్లు పంపిణీ చేపట్టాలని రాయచూరు మురికి వాడల క్రియా వేదిక సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అద్యక్షుడు జనార్దన్ మాట్లాడారు. దశాబ్దం నుంచి నగరంలో వాజ్‌పేయ్ నగర నివాసంలో సర్వే నంబర్– 58 1, 929, 726, 727లలో ఇళ్లు నిర్మించారన్నారు. లబ్ధిదారులకు పంపిణీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని అరోపించారు. ఇళ్లకు సంబంధించి పట్టాలిచ్చారని, ఇళ్లు కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు చేపట్టాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
చౌక డిపో డీలర్ల కమీషన్ పెంచాలి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో విధులు నిర్వహిస్తున్న ఆహార పౌర సరఫరాల శాఖ చౌక డిపో డీలర్లకు కమీషన్ పెంచాలని రాష్ట్ర చౌక డిపో డీలర్ల సంఘం అధ్యక్షుడు కృష్ణప్ప డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం నుంచి ఈకేవైసీ నిధులు రాలేదన్నారు. గూగల్ మ్యాప్‌ను అలవర్చితే ఆహార పదార్థాల పంపిణీలో లోపాలు జరగకుండా ఉంటాయని తెలిపారు. భారత్ బియ్యం, బ్యాళ్లు, గోధుమలు, మంచి నూనె వంటి వాటి పంపిణీకి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
విమోచనోత్సవాలకు
అన్ని ఏర్పాట్లు చేయాలి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17న జరప తలపెట్టిన కళ్యాణ కర్ణాటక ఉత్సవాల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లాధికారి నితీష్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లాధికారి భవనంలో ఏర్పాటు చేసిన అధికారులతో సమావేశంలో మాట్లాడారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నియమాలను తప్పకుండా పాటించాలని నిర్లక్ష్యం వహించిన అదికారులపై చ ర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కళ్యాణ కర్ణాటక ఉత్సవాలకు ముఖ్యమంత్రి కలబుర్గిలో పాల్గొంటున్న తరుణంలో ఎలాంటి లోటు పాట్లు జరగకుండా కట్టుదిట్టంగా ఉత్సవాలను చేపట్టాలన్నారు. సర్దార్ వల్లభ్ బాయి పటేల్ సర్కిల్‌లో అలంకరణలు, మహాత్మ గాంధీ క్రీడా మైదానంలో జరిగే కార్యక్రమాలను కట్టుదిట్టంగా చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఈశ్వర్, అదనపు ఎస్పీ కుమార స్వామి, డీఎస్పీ పరమానంద, నగరసభ కమీషనర్ జుబిన్ మహాపాత్రో ఏసీ గజానన బళి, సంతోష్ రాణి, ఈరణ్ణలున్నారు.
పేరుకే బిసిల సమీక్షలు
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం వెనుక బడిన వర్గాల సమీక్షలను త్వరిత గతిన పూర్తి చేయాలని తీసుకున్న నిర్ణయాలను పున పరిశీలించాలని పలు సంఘాలు అందోళనలు చేపట్టిన ప్రభుత్వం హుటా హుటిన సమీక్షలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించింది. ఇంటి యజమానులు అనుమతి లేకుండా ఎవరు స్టిక్కర్లు అంటించారనే ప్రశ్న మీమాంసగా మారింది.

విజయనగర జిల్లాధికారిణిగా కవితా ఎస్.మణికేరి

విజయనగర జిల్లాధికారిణిగా కవితా ఎస్.మణికేరి

విజయనగర జిల్లాధికారిణిగా కవితా ఎస్.మణికేరి