
కరిమారెమ్మ గుడికి విరాళం
బళ్లారిఅర్బన్: ఇన్‌ఫ్యాంట్రీ రోడ్డు దయా కేంద్రం సమీపంలోని కరిమారెమ్మ ఆలయానికి నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి రూ.60 వేల విరాళం అందజేశారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం సదరు ఆలయ అర్చకులకు ఆయన తన సహాయకుల ద్వారా ఈ కానుక అందించారు. ఈ సందర్భంగా రెడ్డి స్నేహితులు నాగలకెరె గోవింద్, బెళగల్ రోడ్డు, రవి పాల్గొన్నారు.
హత్య మిస్టరీ చేధించిన పోలీసులు
● రూ.300లకే మర్డర్ చేసిన వైనం
● కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్
సాక్షి,బళ్లారి: తాగిన మైకంలో రూ.300లకే హత్య చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం నగరంలోని ఏపీఎంసీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ శోభారాణి, డీఎస్పీ, సీఐలు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి మూడు రోజుల్లో మిస్టరీని పోలీసులు చేధించారు. హనుమాన్ నగర్‌కు చెందిన బాలరాజు (22), కూలీ పనులు చేసే హనుమంతు (20) అనే ఇద్దరు తాగిన మైకంలో గుర్తు తెలియని వ్యక్తితో డబ్బుల కోసం గొడవ పడి హత్య చేశారని దర్యాప్తులో తేలింది.
చాతుర్మాస దీక్షల విరమణ
రాయచూరు రూరల్: మంత్రాలయ పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు చాతుర్మాస దీక్షలకు విరామం పలికారు. సోమవారం మంత్రాలయ మఠంలో విశేష పూజలతో నెలరోజుల పాటు చేపట్టిన దీక్షకు భక్తులు సహకరించారన్నారు.
హాస్టల్‌లో ఆకస్మిక తనిఖీ
హొసపేటె: తాలూకాలో తిమ్మలాపుర గ్రామంలోని మొరార్జీ దేశాయి సైన్స్ ప్రీ–యూనివర్సిటీ రెసిడెన్షియల్ కళాశాలకు ఊహించని రీతిలో సోమవారం రాత్రి విజయనగర జిల్లాధికారి దివాకర్ ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. రెసిడెన్షియల్ పాఠశాలలో పంపిణీ చేసిన ఆహారం నాణ్యత, ఆహార సరఫరా, మరుగుదొడ్లు, తాగునీరు, భోజనాల గదిలో శుభ్రతను పరిశీలించారు. ప్రాథమిక సౌకర్యాల గురించి పిల్లలను ఆరా తీశారు. ఆ సమయంలో మరుగుదొడ్ల శుభ్రత, ఆహార నాణ్యతపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న ప్రిన్సిపాల్, వార్డెన్లకు నోటీసులు అందించాలని అధికారులను ఆదేశించారు. గత 3 నెలలుగా పిల్లలకు శుభ్రత కిట్లు పంపిణీ చేయలేదని ఆయన అధికారులను హెచ్చరించారు. స్టోర్ రూమ్‌లో ఉన్న కిట్లను అక్కడికక్కడే పిల్లలకు పంపిణీ చేశారు.
అప్రమత్తతతో అంటువ్యాధులకు చెక్
రాయచూరు రూరల్: అంటువ్యాధుల బారి నుంచి దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా ఆరోగ్యాధికారి సురేంద్రబాబు సూచించారు. మంగళవారం ఆర్టీసీ విభాగంలో ఆర్టీసీ ఉద్యోగులకు చికిత్స శిబిరాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. మానసిక ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించాలన్నారు. బీపీ, షుగర్, జింక్ ఆహార పదార్థాలు, మద్యపానం, ధూమపానం వంటివి అధికం కావడంతో నూతన వ్యాధులు సంక్రమించే అవకాశాలున్నాయన్నారు. వారం రోజుల పాటు జరిగే శిబిరంలో 2510 మంది ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్టీసీ డీసీ చంద్రశేఖర్, డాక్టర్ గణేష్, చంద్రశేఖర్, శ్రీనివాస్, శ్వేతాంబరి, అశ్రఫ్, మేఘారెడ్డి, బసయ్య, మహంతేష్, పర్వతయ్యలున్నారు.
విద్యాభివృద్ధికి తోడ్పాటు
బళ్లారి రూరల్ : ఇంజినీరింగ్ కళాశాలలో అకడమిక్ విద్య, ఏర్పాట్లపై విద్యార్థులు పరస్పరం పరిచయమై విద్యాభివృద్ధికి తోడ్పడుతుందని ఆర్‌వైఎంఈసీ వి.వి.సంఘ ఉపాధ్యక్షుడు, కళాశాల పరిపాలనాధికారి జానేకుంట బసవరాజ్ తెలిపారు. సోమవారం కళాశాలలో ఏర్పాటు చేసిన శిక్షణ సిద్దత 2025–26 కార్యకర్రమంలో పాల్గొని మాట్లాడారు. సహజంగా నిర్థిష్ట సమయంలో అభ్యసిస్తారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల శిక్షణ వ్యవస్థ సఫలీకృతమవుతుందని తెలిపారు. విద్యార్థులు సామాజిక, భావనాత్మక కౌశ్యాభివృద్ధికి తోడ్పడతాయని తెలిపారు. కళాశాల ప్రిన్స్‌పాల్ డాక్టర్ టి.హనుమంతరెడ్డి, శిక్షణ కార్యక్రమాల విశిష్టతను వివరించారు.

కరిమారెమ్మ గుడికి విరాళం

కరిమారెమ్మ గుడికి విరాళం

కరిమారెమ్మ గుడికి విరాళం