
ఆభరణాల చోరీ.. నిందితుల అరెస్ట్
హుబ్లీ: ఇంటికి వేసిన తాళాన్ని పగలగొట్టి రూ.లక్షలాది విలువ చేసే బంగారు ఆభరణాలు, అలాగే నగదు దోచుకున్న ముగ్గురు ఘరానా ముఠా సభ్యులను విద్యానగర పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను రాజస్తాన్‌ను చెందిన శ్యాంసింగ్(28), కవర్‌పాల్(24), ప్రతాప్‌సింగ్(33)గా గుర్తించారు. వీరి నుంచి సుమారు రూ.15.37 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను జప్తు చేశారు. గత ఆగస్టు 30న విద్యానగర నివాసి రంగనాథ్ అనే వ్యక్తి ఇంటి ఇంటర్‌లాక్‌ను పగలగొట్టి లోనికి వెళ్లిన దుండగులు బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేసి పరారయ్యారు. ఆ మేరకు ఈ నెల 1న బెంగళూరు నుంచి తిరిగి వచ్చిన వేళ చోరీ వెలుగులోకి వచ్చింది. ఘటనపై విద్యానగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

ఆభరణాల చోరీ.. నిందితుల అరెస్ట్