
విపత్తుల నిర్వహణకు రూ.25 కోట్లు సిద్ధం
బళ్లారి రూరల్: దావణగెరె జిల్లాలో విపత్తు నిర్వహణ కోసం రూ.25.9 కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నట్లు దావణగెరె జిల్లాధికారి జీ.ఎం.గంగాధరయ్య స్వామి తెలిపారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయంలో జరిగిన విపత్తు నిర్వహణ ప్రాధికార సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. గత జూన్ నెలలో కురిసిన భారీ వానలకు హొన్నాళి తాలూకాలో ఇళ్లల్లోకి నీరు చేరిన 26 కుటుంబాలకు తలా రూ.2500 అందించినట్లు తెలిపారు. మొత్తం రూ.65 వేలు బాధిత కుటుంబాలకు ఇచ్చినట్లు తెలిపారు. పిడుగులు పడి 5 పశువులు మృతి చెందగా, ఆ కుటుంబ సభ్యులకు రూ.1,87,500 అందజేసినట్లు తెలిపారు. తుంగభద్ర నదిలో వరద ప్రవాహం పెరగడంతో హొన్నాళి బాలరాజ్ ఘాట్ వాసులను సురక్షిత ప్రదేశానికి తరలించినట్లు తెలిపారు. హరిహర తాలూకాలోని రాజనహళ్లి, రామతీర్థ, హొసహళ్లిలో 45 హెక్టార్లలో మొక్కజొన్న పంటనష్టం వాటిల్లినట్లు నివేదిక అందిందని తెలిపారు. సమావేశంలో జెడ్పీ సీఏఓ మాధవ విఠ్ఠల రావ్, ఏడీసీ శీలవంత శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 6 వరకు జిల్లాలో 395 మి.మీ.ల వర్షపాతం నమోదు
దావణగెరె జిల్లాధికారి
జీ.ఎం.గంగాధరయ్య స్వామి వెల్లడి