
పంచ గ్యారెంటీలు సక్రమంగా అందించాలి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో అమలు పరచిన పంచ గ్యారెంటీ పథకాలను సక్రమంగా అందేలా చూడాలని జిల్లా పంచ గ్యారెంటీల కమిటీ అధ్యక్షుడు పామయ్య మూరారి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పంచాయతీ జల నిర్మల సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గృహలక్ష్మి, అన్నభాగ్య, శక్తి, గ్రహ జ్యోతి, యువ నిధి పథకాలను ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. బ్యాంక్ అధికారులు గ్రహలక్ష్మి పథకం ద్వారా నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని సూచించారు. గృహజ్యోతి పథకం గురించి మారుమూల గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించాలని జెస్కాం అధికారులకు తెలిపారు. కార్యక్రమంలో గ్యారెంటీల పదాధికారులు నాగేంద్ర, హన్మంతు, గపూర్, శేఖర్ గౌడ, లక్ష్మణ్, వెంకటరావ్, బసవరాజ, పవన పాటిల్, అధికారులు రోణ, పాండప్ప, చంద్రశేఖర్, నవీన్ కుమార్, నజీర్ తదితరులు పాల్గొన్నారు.