
నియోజకవర్గ అభివృద్ధికి అధిక నిధులు
మాలూరు: తాలూకా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం అధిక నిధులను అందిస్తోందని ఎమ్మెల్యే కేవై నంజేగౌడ తెలిపారు. తాలూకాలోని మిరపనహళ్లి గ్రామంలో దాత ప్రకాష్ ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్‌ను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీఎం సిద్ధ్దరామయ్య ఈనెల 31వ తేదీన జిల్లాకు విచ్చేస్తున్నారని, ఈ సందర్భంగా రూ.2,500 కోట్లతో పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాపుర కిట్టణ్ణ, డీసీసీ బ్యాంకు మాజీ సభ్యుడు చెన్నరాయప్ప, పీఎల్‌డీ బ్యాంకు అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇదే సమయంలో దాత ప్రకాష్ మహిళలకు ఉచితంగా చీరలను పంపిణీ చేశారు.