
నారాయణ గురు ఆశయాలు ఆదర్శం
కోలారు: అస్పృశ్యత నివారణ కోసం బ్రహ్మశ్రీ నారాయణ గురు కృషి చేశారని తహసీల్దార్ సుధీంద్ర అన్నారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ పండుగల ఆచరణ సమితి, తాలూకా ఆర్య ఈడిగర సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన బ్రహ్మశ్రీ నారాయణగురు జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలను తొలగించి ప్రజలను చైతన్యపరిచారన్నారు. నారాయణ గురు చూపిన మార్గంలో నడవాలన్నారు. కార్యక్రమంలో సముదాయ ప్రముఖుడు గోపినాథ్, తాలూకా అధ్యక్షుడు ఉదయ కుమార్, బీఈఓ మునిలక్ష్మయ్య, పురసభ అధ్యక్షుడు భాస్కర్, కోముల్ డైరెక్టర్ మంజునాథ్ పాల్గొన్నారు.