
నేత్రదానంపై ప్రచారం అభినందనీయం
రాయచూరు రూరల్: మరణానంతరం ప్రతి ఒక్కరూ అవయవాలను దానం చేసేందుకు ముందుకు రావాలని కిల్లే బ్రహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్యులు సూచించారు. సోమవారం హుబ్లీ ఎంఎం జోషి నేత్ర కేంద్రం ఆధ్వర్యంలో నేత్రదానం పక్షోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేత్రదానంపై జన జాగృతి జాతాను ప్రారంభించారు. అనంతరం అంబేడ్కర్ సర్కిల్‌లో జాతాను ఉద్దేశించి శాంతమల్ల శివాచార్యులు మాట్లాడారు. గత నెల 25 నుంచి రక్తదానం మాదిరిగా నేత్రదానంపై ప్రచారం చేపట్టడం అభినందనీమయని కొనియాడారు. నేత్రదానం చేసి మరొకరికి చూపు ప్రసాదించాలని సూచించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో జాతా అభియాన చేపట్టి ప్రచారం నిర్వహించారు. కళ్లకు నల్లబట్ట కట్టుకుని అంధ నడక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్ర బాబు, ప్రజాపిత బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత, డాక్టర్ రియాజుద్దీన్, సరోజ, ఎంఎం జోషి నేత్ర కేంద్రం సంచాలకురాలు సుధా పాటిల్ రాజేంద్ర, శ్రీరాజ్ అలిపతి, షోయబ్ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.
టార్పాలిన్లకు
దరఖాస్తు చేసుకోండి
హొసపేటె: 2025–26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి విజయనగరం జిల్లాలో నివసిస్తున్న షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంచార సమాజం సహా అర్హులైన లబ్ధిదారులకు టార్పాలిన్లు అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ వైఏ కాలే తెలిపారు. జిల్లాలో నివసిస్తున్న షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంచార జాతులకు చెందిన అర్హత కలిగిన లబ్ధిదారులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అవసరమైన పత్రాలను దరఖాస్తుకు జత చేసి ఈనెల 15వ తేదీలోపు కార్యాలయంలో అందజేయాలని తెలిపారు.
వర్షాలకు దెబ్బతిన్న పంటలు
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక భాగంలో భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంతెనలు నీటితో నిండి ప్రవహించాయి. 16 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కలబుర్గి జిల్లాలో పెసలు, కంది, ఉద్దు, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. కలబుర్గి జిల్లా చించోళి, షేడమ్‌లో మల్లా మారి పథకంలో నాగరాళ జలాశయం నుంచి నీరు దిగువకు వదిలారు. వాగులో నీరు అధికంగా ప్రవహించాయి. సోమవారం వరద పీడిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మౌనేష్ ముద్గిల్, జిల్లాధికారి శిల్పా శర్మ తదితరులు పర్యటించారు. ప్రజలను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలపై ఆరా తీశారు. పంట నష్ట పరిహారం కోసం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు నివేదికలు సమర్పిస్తామని అధికారులు వెల్లడించారు.
బైక్ ఢీకొని వ్యక్తి మృతి
రాయదుర్గం టౌన్: మిత్రులతో సరదాగా గడిపేందుకు వచ్చిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని దావణగెర జిల్లా తొలహునిసె గ్రామానికి చెందిన శివ (40) అవివాహితుడు. రాయదుర్గంలోని తన మిత్రులు రాము, మల్లికార్జునను కలిసేందుకు ఆదివారం మధ్యాహ్నం వచ్చాడు. అదే రోజు రాత్రి రాత్రి 10 గంటల సమయంలో వాల్మీకినగర్‌లోని మిట్టపై రోడ్డు దాటుతున్న శివను రాయదుర్గం నుంచి మెచ్చిరి గ్రామానికి ద్విచక్రవాహనంపై వెళుతున్న భాస్కర్, కృష్ణ ఢీకొన్నారు. ఘటనలో గాయపడిన ముగ్గురినీ స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో శివ చికిత్స పొందుతూ చనిపోయాడు.
బసవన్న ఆశయసాధనకు కృషి
రాయచూరు రూరల్: బసవన్న ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ సూచించారు. లండన్‌లో బసవేశ్వర విగ్రహం ఆవిష్కరించి దశాబ్దం పూర్తవుతున్న సందర్భంగా ఆదివారం రాత్రి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలకు సహాయ సహకారాలు అందించి అందరి మనస్సులు గెలవాలన్నారు. లండన్‌లో 2015 నవంబర్ 14న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విగ్రహావిష్కరణ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. భవిష్యత్తులో జరిగే ఉత్సవాలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ వచ్చేలా చూడాలని మంత్రులకు ఆహ్వాన పత్రికలు ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ మంత్రి ఎంసీ సుధాకర్, విధాన పరిషత్ సభ్యుడు మంజునాథ భండారీ తదితరులు పాల్గొన్నారు.

నేత్రదానంపై ప్రచారం అభినందనీయం

నేత్రదానంపై ప్రచారం అభినందనీయం

నేత్రదానంపై ప్రచారం అభినందనీయం