
నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి
రాయచూరు రూరల్: జిల్లాలో నిరక్షరాస్యత నిర్మూలనకు అందరూ పాటుపడాలని జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) ఈశ్వర్ కుమార్ సూచించారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ అక్షరాస్యులు కావాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించాలని సూచించారు. చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని పేర్కొన్నారు. అనంతరం అక్షరాస్యత దినోత్సవంపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మల్లికార్జున, గిరియప్ప, చంద్రశేఖర్ భండారి, రోణ, సిద్ధప్ప, వెంకోబ, జీవన్ సాబ్, రాజేంద్ర, రావుత్‌రావ్, శివమ్మ, శరణప్ప, సునీత, నాగరాజ్, అరిఫ్ తదితరులు పాల్గొన్నారు.
ఎంబీబీఎస్ విద్యార్థినికి ఆర్థికసాయం
రాయచూరు రూరల్: ప్రతిభ ఉన్న పేద విద్యార్థులు చదువుకునేందుకు అండగా నిలుస్తామని రవి పాటిల్ ఫౌండేషన్ అధ్యక్షుడు రవి పాటిల్ తెలిపారు. రాయచూరు తాలుకా గణమూరు ఆటో డ్రైవర్ నరసింహులు కుమార్తె కావేరి ఇటీవల ఎంబీబీఎస్ సీటు సాధించింది. ఆటో డ్రైవర్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో కావేరి ఫీజులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతోంది. విషయం తెలుసుకున్న రవి పాటిల్ ఫౌండేషన్ ఆదుకునేందుకు ముందుకొచ్చింది. సోమవారం కావేరికి రూ.50 వేల ఆర్థికసాయాన్ని రవి పాటిల్ అందజేశారు. పుస్తకాలు, ఇతర ఖర్చులకు సాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
అభివృద్ధికి ప్రజల
సహకారం అవసరం
రాయచూరు రూరల్: నగర ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని గురు మిఠ్కల్ శాసన సభ్యుడు శరణే గౌడ కందకూరు పేర్కొన్నారు. సోమవారం యాదగిరి జిల్లా గురు మిఠ్కల్‌లో మినీ విధానసౌధ, వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో నగర ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని తెలిపారు. కార్యక్రమంలో నగర సభ అధ్యక్షుడు జయశ్రీ పాటిల్, ఉపాధ్యక్షురాలు రేణుక పడిగే, అంబిగర చౌడయ్య మండలి అధ్యక్షుడు బాబురావు, చించినసూర్ నగర సభ ముఖ్య అధికారి భారతి దండోతి తదితరులు పాల్గొన్నారు.
గణపతి నిమజ్జనం
రాయచూరు రూరల్: నగరంలోని బలరామ పాఠశాల మహాగణపతి నిమజ్జనం వైభవంగా జరిగింది. ఆదివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమైన వినాయకుడి ఊరేగింపు.. అర్ధరాత్రి 1 గంట వరకు కొనసాగింది. తీన్ కందిల్ నుంచి సూపర్ మార్కెట్, పేట్లా బురుజు మీదుగా ఖాస్ బావి వరకూ వినాయకుడిని ఊరేగించారు. యువత డప్పుచప్పుళ్ల మధ్య నృత్యం చేస్తూ సందడి చేశారు. రంగులు చల్లుకుంటూ అలరించారు. పలువురు భక్తులు భక్తిగీతాలు ఆలపిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం వినాయకుడిని నిమజ్జనం చేశారు.
పాటుకాటుతో మహిళ మృతి
హొసపేటె: గంగావతి తాలూకాలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన నింగమ్మ (37) పాముకాటుతో సోమవారం మృతి చెందింది. నింగమ్మ ఎప్పటిలాగే రాంపూర్ సీమలోని పొలంలో పనికి బయలుదేరింది. ఆమె కాలిపై నాగుపాము కాటు వేసింది. నాగుపామును చూసి తనతో ఉన్న మహిళలకు పారిపోవాలని చెప్పింది. గమనించిన తోటి మహిళలు ఆమెను వెంటనే వైద్య చికిత్సల కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది.

నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి

నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి

నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి

నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి