
ముగిసిన జోకుమార ఉత్సవాలు
హొసపేటె: గణపతి నవరాత్రుల తర్వాత వచ్చే జోకుమార స్వామికి పూజలు చేస్తే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఉత్తర కర్ణాటకలోని విజయనగరంతో సహా వివిధ జిల్లాల్లో 7 రోజుల పాటు జరుపుకునే పండుగ సోమవారం ముగిసింది. ఇందులో భాగంగా మహిళలు బుట్టలో జోకుమార స్వామిని అలంకరించుకుని ఇంటింటికీ తీసుకెళ్లారు. ఓ జోకుమారా అని పాడుతూ వచ్చే మహిళల బుట్టలోకి భక్తులు ఆహారం, ధాన్యం, డబ్బు అందజేశారు. ఈ ఉత్సవాల్లో మహిళలు భక్తిగీతాలు పాడుతూ స్వామికి విశేష పూజలు చేశారు. వర్షం, పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించారు. కాగా.. పట్టణ ప్రాంతాల్లో ఇటువంటి ఆచారం కనుమరుగవుతోంది. సీ్త్రలు మాత్రమే కాకుండా రైతు సమాజం కూడా జోకుమార స్వామిని భక్తితో పూజిస్తారు. హోస్పేట్ నగరంలో ఇటువంటి ఆచారం కనిపించడం విశేషం.